Thursday, May 2, 2024
- Advertisement -

స్వ‌రం మార్చిన జేసీ…అంత‌లో ఎంత మార్పు..

- Advertisement -

జ‌గ‌న్‌ను ఎప్పుడూ విమ‌ర్శించే టీడీపీ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎన్నిక‌ల ముందు జ‌గ‌న్‌పై విరుచుకు ప‌డిన జేసీ పోలింగ్ పూర్తియి త‌ర్వాత త‌న స్వ‌రం మార్చారు. ఫ‌లితాలు వైసీపీకీ అనుకూలంగా ప‌వ‌నాలు వీస్తుండ‌టంతో ప్లేటు ఫిరాయించేందుకు సిద్ద‌మ‌య్యార‌నె వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే, ఆయ‌న చూపు వైసీపీ వైపు మ‌ర‌లిందా? అనే కొత్త చ‌ర్చ ప్ర‌స్తుతం జ‌రుగుతోంది. తాజాగా ఆసక్తికర, సంచ‌ల‌న వ్యాఖ్యలు చేయ‌డమే ఇందుకు నిద‌ర్శ‌నం.

తాజాగా జేసీ దివాకర్ రెడ్డి ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలోని రెడ్డి వర్గమంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెనుకే ఉన్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నం రేపుతున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో 99.999 పర్సంట్ జగన్ వెంట నిలిచారని, నూటికో, కోటికో ఒకడు తనలాంటోడు జగన్ వెంట లేడని అన్నారు.

ఐదేళ్ల పాలనలో చంద్రబాబునాయుడు 120 పథకాలు ప్రవేశ పెట్టినా, అవేవీ పనిచేయలేదని, చివరి నిమిషంలో తీసుకొచ్చిన పసుపు కుంకుమ పథకం మాత్రమే పనిచేసిందని అంచనా వేశారు. ఈసారి ఎన్నికలు పూర్తిగా కులం పేరు మీదే జరిగాయని చెప్పారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఖాయమని జేసీ ధీమా వ్యక్తం చేశారు. జగన్ గెలిచి, రాష్ట్ర అభివృద్ధి కోసం పాటు పడితే తాను సంతోషిస్తానని అన్నారు.

ఇన్నాళ్లు జ‌గ‌న్ అంటే విరుచుకుప‌డిన జేసీ ఇప్పుడు ఆయ‌న‌కే ప్ర‌జాబ‌లం ఉంద‌ని ప్ర‌క‌టించ‌డం వెనుక‌…జ‌గ‌న్‌కు ద‌క్క‌బోయే అధికారం కార‌ణ‌మ‌ని ప‌లువురు అంచ‌నా వేస్తున్నారు. వైసీపీ అధికారంలో రావ‌డం ఖాయ‌మ‌నే జేసీ చూపు అటువైపు ప‌డింద‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -