Tuesday, May 7, 2024
- Advertisement -

భ‌విష్య‌త్తులో బాబు ఆర్థిక నేత‌ల‌కు మూసుకుపోయిన రాజ్య‌స‌భ దారులు

- Advertisement -

ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో బాబుత‌న రాజ‌కీయ చ‌రిత్ర‌లో ఎప్పుడూ లేనంత ఘోర ప‌రాజ‌యాన్ని మూట‌గ‌ట్టుకున్నారు. జ‌గ‌న్ దెబ్బ‌కి టీడీపీ పార్టీ కుదేల‌య్యింది. బాబుకు రెండు విధాలుగా దెబ్బ ప‌డింది. ఒక పార్టీ ఘోరంగా దెబ్బ‌తింటే…బాబుకు బ‌య‌ట‌నుంచి ఆర్థిక వ‌ణ‌రుల‌కు వెన్నుద‌న్నుగా ఉన్న‌ బినామీలకు రాజ్య‌స‌భ‌లో అడుగు పెట్ట‌కుండా అడ్డుక‌ట్ట ప‌డింది.

ప్ర‌స్తుతం ఉన్న ఎంపీ సీట్ల ప‌రంగా చూసుకుంటె భ‌విష్య‌త్తులో ఒక్క రాజ్య‌స‌భ సీటుకూడా వ‌చ్చే అవ‌కాశాలు లేవు. ఇది పార్టీకి అర్థికంగా పెద్ద దెబ్బే. ఇప్ప‌టి వ‌ర‌కు టీడీపీనుంచి రాజ్య‌స‌భ్యులుగా బాబు బినామాలుగా భావించే సీఎం ర‌మేష్‌, సుజ‌నా చౌద‌రి లాంటి కొంద‌రు నేత‌లు ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. వీరెవ‌రూ కూడా ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో పాల్గొన‌రు. బ్యాక్ డోర్ ద్వారా కోట్లు డ‌బ్బులు పార్టీకి ఇచ్చి రాజ్య‌స‌భ సీట్లు ద‌క్కించుకోనే వారు. కాని ఇప్పుడు మాత్రం ఆ అవ‌కాశం లేదు. ఎందుకంటె ప్ర‌స్తుతం వారి కాల‌ప‌రిమితి ముగిస్తె త‌ర్వాత రాజ్య‌స‌భ‌లో ఆపార్టీకి ప్రాతినిధ్యం వ‌హించేందుకు ఒక్క సీటుకూడా రాదు.

2014 ఎన్నిక‌ల్లో వైసీపీ దాదాపు 60 సీట్ల‌కు పైగా సాధించి రెండు రాజ్యసభ సీట్లను తన సొంతం చేసుకోగలిగింది. అయితే తెలుగుదేశం పార్టీకి దక్కింది కేవలం ఇరవై మూడు ఎమ్మెల్యే సీట్లే కాబట్టి.. ఆ పార్టీకి కనీసం ఒక్క రాజ్యసభ సీటు కూడా దక్కే అవకాశం ఉండదు. సీఎం రమేష్ లు, సుజనా చౌదరులు కూడా ఈ సారి టర్మ్ ముగిస్తే ఇంటిదారి పట్టాల్సిందే అని పరిశీలకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు.

44 మంది సభ్యులు ఉంటే ఒక రాజ్యసభ పదవి దక్కుతుంది. దాని ప్ర‌కారం చూసుకుంటె టీడీపీ23 మంది మాత్ర‌మే ప్ర‌స్తుతం న్నారు. దీన్ని బ‌ట్టి భ‌విష్య‌త్తులో రాజ్య‌స‌భ‌లో మొద‌టి సారి టీడీపీకి ప్రాధాన్య‌త లేకుండా పోతుంది. ప్రస్తుతం రాజ్యసభలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వారిలో తోట సీతారామలక్ష్మీ త‌న ప‌ద‌వీ కాలం ఏప్రిల్ 9 2020 తో ముగుస్తుంది.

ఆమెతోపాటు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు సుబ్బిరామిరెడ్డి, ఎంఏ ఖాన్, కేకేల కాలంకూడా ముగుస్తుంది.2022 జూన్ 21న సుజనాచౌదరి, టీజీ వెంకటేశ్ లు తమ పదవీకాలాన్ని పూర్తి చేసుకోనున్నారు. ఇకపోతే 2024 ఏప్రిల్ 2న కనకమేడల రవీంద్రకుమార్, సీఎం రమేష్ ల పదవీకాలం పూర్తి కానుంది. ఐదేళ్లలో టీడీపీకి ప్రాతినిధ్యమనేది రాజ్యసభలో ప్రాతినిధ్యం లేక‌పోవ‌డంతో టీడీపీ నేత‌ల్లో అంత‌ర్మ‌థ‌నం మొద‌ల‌య్యింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -