Monday, May 6, 2024
- Advertisement -

రాజ‌కీయ పార్టీల‌తో సీఈసీ భేటీ….

- Advertisement -

తెలంగాణాలో ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఏర్పాట్ల‌ను ప‌రిశీలించేందుకు ఛీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఓపి రావత్ నేతృత్వంలో 11 సభ్యులతో కూడిన కేంద్ర ఎన్నికల బృందం రాష్ట్రానికి వ‌చ్చింది. హైదరాబాద్‌లోని హోటల్ తాజ్‌కృష్ణలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమైంది.

సమావేశంలో భాగంగా ఆయా రాజకీయ పార్టీలతో వేర్వేరుగా భేటీ కానున్న ఈసీ.. ఒక్కో పార్టీకి 19నిమిషాల సమయం కేటాయించింది.తెలంగాణ ఎన్నికలకు సంబంధించి పలు అంశాలపై చర్చించారు. మొత్తం 9 పార్టీలకు ఆహ్వానం అందగా.. ఒక్కో పార్టీ నుంచి ఇద్దరు సభ్యుల చొప్పున హాజరయ్యారు. అనంత‌రం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారితో పాటు పోలీసు శాఖ నోడల్ అధికారి జితేందర్‌తో పాటు పలువురు అధికారులతోనూ స‌మావేశ మ‌య్యారు.

11 మంది సభ్యులతో కూడిన కేంద్ర ఎన్నికల సంఘం బృందం రాష్ట్ర పర్యటనకు వచ్చేసింది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌ కుమార్‌ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో వీరికి స్వాగతం పలికారు. అనంతరం సీఈసీ ఓపీ రావత్.. రజత్ కుమార్‌తో సమావేశమై తెలంగాణ ఎన్నికలపై చర్చించారు.

కేంద్ర ఎన్నికల సంఘం బృందం రాష్ట్రంలో 3 రోజుల పాటు పర్యటించనుంది. మంగళవారం జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు, డీఐజీలతో ఎన్నికల కమిషనర్లు సమావేశమవుతారు.ఎన్నిక‌ల ఏర్పాట్ల స‌ర‌ళి, శాంతిభద్రతలు, సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతపై పోలీసు అధికారులకు సూచనలు చేయనున్నారు.

అనంత‌రం సీఎస్,డిజిపి, ఫైనాన్స్ సెక్రటరీ, ఆబ్కారీ ముఖ్య కార్యదర్శి, రవాణా అధికారులతో భేటీ జరగనుంది.ఆపై 12.30 గంటల నుండి 1.00 వరకు మీడియా సమావేశం నిర్వహించనున్న ఈసీ.. అనంతరం తిరిగి ఢిల్లీ వెళ్లనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -