Thursday, May 2, 2024
- Advertisement -

రెండు డోసులు తీసుకున్న న‌ర్సుకు క‌రోనా

- Advertisement -

దేశంలో క‌రోనా వైర‌స్ క‌ల్లోలం రేపుతోంది. ఇటీవ‌ల త‌గ్గుముఖం ప‌ట్టిన‌ట్టు క‌నిపించిన క‌రోనా మ‌హ‌మ్మారి మ‌ళ్లీ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. దీనికి తోడు వ్యాక్సిన్ తీసుకున్న వారు సైతం మ‌ళ్లీ క‌రోనా బారిన‌ప‌డుతుండ‌టంతో ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌లు వ్య‌క్తం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే తాజాగా దేశంలో రెండు డోసుల క‌రోనా టీకా తీసుకున్న‌ప్ప‌టికీ ఓ న‌ర్సుకు క‌రోనా సోకింది.

వివ‌రాల్లోకెళ్తే.. రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుక‌న్న‌ప్ప‌టికీ ఓ న‌ర్సుకు కోవిడ్‌-19 సోకిన ఘ‌ట‌న దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో తాజాగా వెలుగులోకి వ‌చ్చింది. సత్యవాది రాజా హరీశ్చంద్ర ఆస్పత్రిలో వాధ్వా అనే మహిళ నర్సుగా విధులు నిర్వ‌ర్తిస్తోంది. ఫ్రంట్‌లైన్ వర్కర్లకు తొలిదశలో టీకా పంపిణీ చేయడంతో వాధ్వా జనవరి 18న కోవిడ్-19 వ్యాక్సిన్ తొలి డోస్ తీసుకున్నారు. రెండో డోస్‌ను 28 రోజుల తర్వాత ఫిబ్రవరి 17న వేయించుకున్నారు.

అయితే, ఇటీవ‌ల ఆమెకు ఒళ్లు నొప్పులు, చెమటలు పట్టి స్వల్ప అనారోగ్యానికి గురైంది. రోజూ మాదిరిగానే ఆసుపత్రిలో విధులు నిర్వర్తిస్తుండగా కొద్దిగా అనారోగ్యం అనిపించ‌డంతో క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకంది. ఆమెకు నిర్వహించిన కోవిడ్ యాంటీజెన్ పరీక్షల్లో వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విష‌యాన్ని స‌ద‌రు న‌ర్సు తాజాగా వెల్ల‌డించారు. ‘సోమవారం మధ్యాహ్నం తీవ్రమైన ఒళ్లు నొప్పులు.. విపరీతంగా చెమటలు పట్టాయి.. దీంతో క‌రోనా ప‌రీక్ష చేంచుకున్నాను. పాజిటివ్‌గా వ‌చ్చింది’ అని తెలిపారు.
ఏపీకి ప్రత్యేక హోద ఇవ్వ‌లేం: కేంద్రం

నిమ్మరసం, పసుపు కలిపి తాగితే.. లాభాలేంటో తెలుసా?

కేంద్రంపై కేటీఆర్ ఫైర్

ల‌క్ష‌లాది మందికి న్యాయ సాయం అందట్లేదు: సుప్రీం జడ్జి జస్టిస్​ ఎన్వీ రమణ

సుప్రీంకోర్టు మెట్లెక్కిన తెలుగు అకాడమీ అంశం

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -