Friday, April 26, 2024
- Advertisement -

అప్పుల ఊబిలో రాష్ట్రాలు.. ఎంతో తెలుసా ?

- Advertisement -

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పలు సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతూ అధివృద్ది పథంలో దూసుకుపోతున్నారు. దాంతో రాష్ట్ర బడ్జెట్ భారీగా ఖర్చు అవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యం సంక్షేమ పథకాల అమలు కోసం అప్పులు కేంద్రం వద్ద భారీగానే అప్పులు తీసుకుంటున్నారు ఇద్దరు ముఖ్యమంత్రులు. ఇక తాజాగా తెలుగు రాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాల యొక్క అప్పుల వివరాలు కేంద్రప్రభుత్వం వెల్లడించింది.

కేంద్రం నుంచి అప్పులు భారీగా తీసుకుంటున్న రాష్ట్రాలలో తమిళనాడు టాప్ ప్లేస్ లో ఉంది. ఆ రాష్టం 6 లక్షల 59 వేల 868 కోట్లు అప్పుగా ఉన్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పుకొచ్చారు. ఇక ఆ తరువాత ప్లేస్ లో ఉత్తర ప్రదేశ్ 6 లక్షల 53 వేల కోట్ల అప్పుతో రెండవ స్థానంలో ఉన్నట్లు తెలిపారు. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. ఆంధ్ర ప్రదేశ్ 2022 నాటికి 3 లక్షల 98 వేల 903 కోట్లు, అలాగే తెలంగాణ విషయానికొస్తే 3 లక్షల 12 వేల 191 కోట్లు అప్పుగా ఉన్నట్లు నిర్మలా శీత రామన్ లిఖిత పూర్వకంగా వెల్లడించారు. అయితే ప్రస్తుతం కేంద్రం ప్రకటించిన లెక్కల ప్రకారం.. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన తెలుగు రాష్ట్రాలు అప్పుల విషయంలో కాస్త వెనకే ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే ప్రతి ఏడాది అప్పుతీసుకునే బడ్జెట్ పెరుగుతూ ఉండడం గమనార్హం. 2021 లెక్కల ప్రకారం ఆంద్ర ప్రదేశ్ తీసుకున్న అప్పు 3 లక్షల 60 వేల 333 కోట్లుగా ఉంటే 2022 వచ్చే సరికి 3 లక్షల 98 వేల 903 కోట్లకు చేరింది. అలాగే తెలంగాణ 2021 లో 2 లక్షల 67 వేల 530 కోట్లు అప్పుగా ఉంటే .. 2022 నాటికి 3 లక్షల 12 వేల 191 కోట్ల కు చేరింది. అయితే మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, గుజరాత్ వంటి రాష్ట్రాలు అప్పుల్లో మన తెలురు రాష్ట్రాల కంటే ముందు ఉండడం గమనార్హం.

Also Read

మళ్ళీ తెరపైకి పిఒకే.. ఈ సారి యుద్దం వస్తే !

అలా అయితే కోమటిరెడ్డికి.. పెద్ద దెబ్బే ?

తెలంగాణ వైపు చూస్తున్న ఏపీ గ్రామాలు !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -