Wednesday, April 24, 2024
- Advertisement -

మీడియాలో క‌ల‌క‌లం….

- Advertisement -

రాష్ట్రంలో ఏమాఫియా బ‌య‌ట‌కు వ‌చ్చినా అందులో మీడియాకు కూడా లింకులు బ‌య‌ట‌ప‌డుతూనె ఉంటాయి. గ‌తంలో ఎక్సైజ్ ముడుపుల కేసు.. నిన్న మొన్నటి గ్యాంగ్ స్టర్ నయీం కేసులో జ‌ర్న‌లిస్ట్‌ల‌కు సంబంధాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. ఇప్పుడ తాజాగా టాలీవుడ్‌ను ఊపేస్తున్న డ్రగ్స్ కేసుకు సంబంధించికూడా హైదరాబాద్ లో పని చేసే కొందరు విలేకరులకు లింకులున్నాయట.
ఇప్పటికే ఎక్సైజ్ సిట్ విభాగం ఈ జాబితాను తయారు చేసే పని పెట్టుకుంది. ఈ కేసులో అరెస్టైన డ్రగ్స్ బ్రోకర్ పీయూష్ ను విచారించిన సందర్భంలో ఈ విషయాలు బయటపడ్డాయట. డ్ర‌గ్స్ కోసం కాకుండా కొందరు విలేకరులతో తనకు సంబంధాలున్నాయని.. తరచుగా తనను కలిసే వారని పీయూష్ చెప్పేశాడట. డ్రగ్స్ కోసం కాదని…తనను మందు పార్టీలకు .. పబ్ లో విందులు వినోదాల కోసం వాడుకునే వారని సిట్ ఇంటరాగేషన్ లో బ‌య‌ట‌పెట్టాడంట‌.
ఇప్ప‌టికె 16 మంది విలేకరులకు డ్రగ్స్ కేసులో నిందితుడు పీయూష్ తో సంబంధాలున్నట్లుగా సిట్ ఒక జాబితాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. వీరిలో ఎనిమిది మంది వివిధ ఛానళ్లలో పని చేసిన.. పని చేస్తున్న క్రైం బీట్ రిపోర్టర్ల పేర్లు ఉన్నట్లు సమాచారం. మిగతా వారందరూ బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ ఏరియాలో పనిచేసే లోకల్ రిపోర్టర్లు ఉన్నారంట‌.
సిట్ అరెస్ట్ చేసిన పీయూష్ కొంతకాలం బంజారాహిల్స్ లోని టీజీ ఫ్రైడే పబ్ మెయింటేన్ చేశాడు. అప్పుడే కొందరు విలేకరులు పీయూష్ డ్రగ్ వ్యాపారని తెలిసినా తమ సరదాల కోసం అతనితో చెట్టాపట్టాలేసుకొని తిరిగినట్లు సిట్ వర్గాలు కూపీ లాగాయి.సిట్ డైరెక్టర్ అకున్ సభర్వాల్ ఇప్పుడు విలేకరుల జాబితాను కూడా బయట పెడుతారా.. కొందరిని పిలిచి ఓ హెచ్చరిక జారీ చేసి వదిలేస్తారా.. అనేది మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -