Monday, May 6, 2024
- Advertisement -

అతి త్వ‌ర‌లో అమ‌రావ‌తికి వైసీపీ పార్టీ త‌ర‌లింపు… ఫిక్స్‌

- Advertisement -

ఏపీలో వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌లు అన్ని పార్టీల‌కు క‌త్తి మీద సాము లాంటివి. అధికారంలోకి రావ‌డాని ప్ర‌ధానంగా భాజాపా-టీడీపీ కూట‌మి, వైసీపీ భారీ క‌స‌ర‌త్తులు ప్రారంభించాయి. ఎన్నిక‌ల్లో టిడిపి ఓడినా ఇబ్బంది ఉండ‌దు. కాని వైసీపీ మాత్రం ఓట‌మిని చ‌విచూస్తె పార్టీని మూసుకోవాల్సిందే. అందుకే ఆ పార్టీ అధినేత జ‌గ‌న్ అధికారంలోకి రావ‌డానికి త‌న శ‌క్తియుక్తులు ఒడ్డుతున్నారు. అయితే ఆయ‌న‌పై అధికార పార్టీనుంచి, సొంత పార్టీనుంచి అనేక విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. వీట‌న్నింటికి చెక్ పెట్టేందుకు జ‌గ‌న్ అతి పెద్ద స్టెప్ తీసుకున్నారు.

ప్ర‌స్తుతం రాష్ట్రంలో అధికార పార్టీ వైఫ‌ల్యాల‌పై పోరాడుతున్న వైసీపీకి మంచి మైలేజి వ‌స్తోంది.అన్ని స‌ర్వేలల్లోకూడా జ‌గ‌న్ సీఎం కావ‌డం ఖాయ‌మ‌నే ఫ‌లితాలు వ‌స్తున్నాయి. కాని జ‌గ‌న్ చేస్తున్న స్వీయ త‌ప్పిదాల వ‌ల్లే వైసీపీ రానించ‌లేక‌పోతోంద‌నె విమ‌ర్శ‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి.

జ‌గ‌న్‌ను ప్ర‌ధానంగా క‌ల‌వ‌ర‌పెడుతున్న అంశాల్లో ..గ్రామ‌స్థాయిలో క్యాడ‌ర్ ఉన్నా వారిని ముందుకు న‌డిపించే దానికి స‌రైన నాయుకులు లేరన్న‌ది వాస్త‌వం.ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టే సంద‌ర్భాల్లో శృతిమించ‌డం,సీనియ‌ర్ నేత‌ల మాట‌ల‌ను లెక్క‌చేకుండా ఉండ‌టం,నియేజ‌క వ‌ర్గాల్లో స‌రైన నాయ‌కుల‌ను నియ‌మించ‌క‌పోవ‌డంలాంటివి జ‌గ‌న్‌ను క‌ల‌వ‌ర‌పెడుతున్నాయి.

గ‌త ఎన్నిక‌ల్లో త‌క్కువ ఓట్ల‌తో అధికారాన్ని కోల్పోయామ‌ని జ‌గ‌న్ ప‌దేప‌దే వ్యాఖ్యానిస్తుంటారు. కాని ఇప్ప‌టికి హైద‌రాబాద్‌నుంచే రాజ‌కీయాలు న‌డుపుతుండ‌టం పార్టీకి డ్యామేజ్ క‌లుగుతోంది. ప‌రిపాల‌నా అంతా ఏపీనుంచిజ‌రుగుతున్న స‌మ‌యంలో జ‌గ‌న్ ఇక్క‌డ‌నుంచి కార్య‌క‌లాపాలు కొన‌సాగించ‌డంలో అర్థంలేదు. అమ‌రావ‌తినుంచె కార్య‌క‌లాపాలు కొన‌సాగించ‌డం వ‌ల్ల పార్టీ నాయ‌కులు,కార్య‌క్త‌ల‌లో మ‌రింత జోష్‌ని పెంచ‌వ‌చ్చు.

వీట‌న్నింటిని జ‌గ‌న్ దృష్టిలో పెట్టుకొని సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకోబోతున్నారు. లోట‌స్ పాండ్ నుంచి త‌న కార్యాల‌యాన్ని విజ‌య‌వాడ‌కు మార్చుతున్నారు. ఇప్ప‌టికే అన్ని ఏర్పాట్లు పూర్తియ్యాయి. తాడెప‌ల్లి, ఉండ‌వ‌ల్లిలో సొంత ఇళ్లు, పార్టీ కార్యాల‌యం అమ‌రావ‌తి న‌డిఒడ్డును ఏర్పాటు చేస్తున్నారు. వారం రోజుల్లోనె పూర్తిగా త‌న మ‌కాం మార్చ‌బోతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -