Thursday, May 9, 2024
- Advertisement -

జ‌గ‌న్ అవినీతి ఆరోప‌న‌లు మాత్ర‌మే ఎదుర్కొంటున్నారు..

- Advertisement -
YSRCP president YS Jagan Mohan Reddy not convicted says Purandeswari

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప్ర‌ధాని మోదీతో భేటీ రాష్ట్ర‌వ్యాప్తంగా ఎంత సంచ‌ల‌నం రేపిందో అంద‌రికీ తెలిసిందే.ఇది అధికా ….విప‌క్ష‌పార్టీల మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతోంది.మాట‌ల యుద్ధం ఎక్కువ‌గా మిత్ర‌ప‌క్షాల‌యిన టీడీపీ …భాజాపా మ‌ధ్య‌నే కొన‌సాగుతోంది.జ‌గ‌న్‌ను టీడీపీ విమ‌ర్శిస్తుంటె…భాజాపా మాత్రం జ‌గ‌న్‌కు స‌పోర్ట్‌గా …టీడీపీకీ కౌంట‌ర్ ఇస్తోంది.

తాజాగా జ‌గ‌న్ పై భాజాపా సీనియ‌ర్‌నేత పురందేశ్వ‌రి చేసిన వ్యాఖ్య‌లు టీడీపీకి మంట పుట్టిస్తున్నాయి.జగన్ పైన వచ్చిన ఆరోపణలు రుజువు కాలేదని, కాబట్టి ఆయనను దోషిగా భావించలేమని టిడిపికి కౌంటర్ ఇచ్చారు. బీజేపీ కార్యకర్తలకు గుర్తింపు లేకున్నా తాము మిత్రధర్మాన్ని పాటిస్తున్నామని ఆశ్చర్యకరమైన కామెంట్లు చేశారు భాజాపా సీనియ‌ర్‌నేత పురందేశ్వ‌రి.
జగన్ కలిస్తే తప్పేంటి ఆమె ఆదివారం మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీ ఎవరు, ఎప్పుడైనా కలువవచ్చునని చెప్పారు. ఓ రాష్ట్రానికి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ కలిస్తే తప్పేమిటని నిలదీశారు. మోడీతో జగన్ కలయికను తప్పుబట్టే వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని పురంధేశ్వరి అన్నారు.అయితే ఇప్పుడు ఈవ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి.

{loadmodule mod_custom,Side Ad 1}

టిడిపి మాటల దాడి.. బీజేపీ ఎదురుదాడితో ఆత్మరక్షణ ప్రధాని మోడీని ఏపీ ప్రతిపక్ష నేత కలవడాన్ని టిడిపి నేతలు ప్రశ్నిస్తోన్న విషయం తెలిసిందే. 11 ఛార్జీషీట్లలో ఏ 1 నిందితుడిగా ఉన్న జగన్‌కు మోడీ అపాయింటుమెంట్ ఎలా ఇచ్చారని, క్రిమినల్‍‌ను పక్కన కూర్చోబెట్టుకోవడంపై బీజేపీ ఆలోచన చేయాలని టిడిపి నేతలు వరుసగా మాటల దాడి చేశారు. దీనిపై బీజేపీ నేతలు కూడా అంతే ధీటుగా స్పందిస్తున్నారు. అసలు ప్రధానిని ఓ ప్రతిపక్ష నేత కలిస్తే తప్పేమిటని ప్రశ్నిస్తున్నారు. జగన్ పైన కేసులు ఇంకా రుజువు కాలేదని తేల్చి చెబుతున్నారు. బీజేపీ ఎదురు దాడితో ఇప్పుడు టిడిపి ఆత్మరక్షణలో పడినట్లుగా కనిపిస్తోంది.
టిడిపి మోడీ – జగన్ భేటీపై టిడిపి నేతలు వరుసగా మాటల దాడి చేస్తుండటంతో.. చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా ఉన్న బీజేపీ నేత మాణిక్యాల రావు కూడా ఘాటుగా స్పందించారు. బీజేపీపై టిడిపి నేతలు కుట్ర చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
జగన్ క్రిమినల్ అంశంపై బీజేపీ, వైసిపి సమాధానం ప్రధానిని ఎవరైనా కలువవచ్చునని, కానీ క్రిమినల్స్‌తో కూర్చోవడం సరికాదన్న టిడిపి నేతలకు వైసిపితో పాటు బీజేపీ నేతలు కూడా సమాధానం చెబుతున్నారు. జగన్ ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడే తప్ప నేరస్తుడు కాదని వైసిపి చెబుతోంది.వైసీపీ,భాజాపా ఎదురుదాడితో ఏమి మాట్లాడాలో తెలియ‌క ప‌చ్చ‌త‌మ్ముళ్లు త‌ల‌గోక్కుంటున్నారు.

{loadmodule mod_sp_social,Follow Us}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -