Friday, May 10, 2024
- Advertisement -

క్రికెట్ కు జహీర్ ఖాన్ గుడ్ బై!

- Advertisement -

పేస్ బౌలర్ గా టీమ్ ఇండియాకు మరిచిపోలేని విజయాలు అందించిన యార్కర్ షాన్ జహీర్ ఖాన్..  అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. వరుస గాయాలతో జట్టులో చోటుకు గ్యారెంటీ లేకపోవడం.. వయసు మీద పడడంతో.. ఇక క్రికెట్ ఆడలేనని నిర్ణయించుకున్న జహీర్.. ఈ నిర్ణయం తీసుకున్నాడు.

రోజుకు కనీసం 18 ఓవర్లు బౌలింగ్ చేసే సామర్థ్యం తనకు లేదని గుర్తించిన మరు క్షణమే..  క్రికెట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు.. తన రిటైర్మెంట్ అనౌన్స్ మెంట్ లో జహీర్ చెప్పాడు. ఇకపై ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడేది లేదని తేల్చేసిన జహీర్.. ఇంతకు ముందే చేసుకున్న ఒప్పందం ప్రకారం  ఐపీఎల్ తొమ్మిదో సీజన్ లో.. ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు తరఫున ఆడనున్నట్టు ప్రకటించాడు.

37 ఏళ్ల జహీర్ ఖాన్.. 92 టెస్టుల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. మొత్తం 311 వికెట్లు తన ఖాతాలో వేసుకున్న జహీర్.. భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. భారత క్రికెట్ లో అనిల కుంబ్లే (619 వికెట్లు), కపిల్ దేవ్ (434 వికెట్లు), హర్భజన్ సింగ్ (417 వికెట్లు) తర్వాత అత్యధిక వికెట్లు సాధించిన నాలుగో బౌలర్ గా రికార్డులకెక్కాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ విషయానికొస్తే… భారత జట్టు తరఫున 200 మ్యాచ్ లు ఆడిన జహీర్.. మొత్తం 282 వికెట్లు పడగొట్టాడు. 2011 వన్డే ప్రపంచ కప్ టోర్నమెంట్ లో 21 వికెట్లు తీసిన జహీర్ ఖాన్.. జట్టు కప్ నెగ్గడంలో కీలక పాత్ర వహించాడు. అలాగే.. 17 టీ20 మ్యాచ్ లు ఆడి.. 17 వికెట్లు తీశాడు.

టీ20 మ్యాచుల్లో కూడా సత్తా చాటిన ఈ స్పీడ్ స్టర్.. ప్రస్తుతం ఐపీఎల్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు తరఫున ఆడుతున్నాడు. త్వరలో జరగనున్న తొమ్మిదో ఐపీఎల్ సీజన్ తర్వాత.. క్రికెట్ నుంచి పూర్తిగా తప్పుకోనున్నట్టు జహీర్ డిక్లేర్ చేశాడు. వరుస గాయాలతో 3, 4 ఏళ్లుగా జట్టులోకి వస్తూ పోతూ ఉన్న జహీర్.. ఇక తనలో క్రికెట్ మిగిలి లేదని గుర్తించినట్టు చెప్పాడు. ఓ క్రికెటర్ గా… ఆట నుంచి తప్పుకోవడం కంటే బాధాకరమైన విషయం లేదన్న జహీర్.. తనలో ఆడే సత్తా లేనపుడు గౌరవంగా రిటైర్ అవడమే మంచిదంటూ తన కెరీర్ ఇన్నింగ్స్ డిక్లరేషన్ స్టేట్ మెంట్ లో చెప్పుకొచ్చాడు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -