జగన్ ” అతిపెద్ద కుంభకోణం ” బయటకు తీస్తాడట !

ప్రస్తుతం ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన పరిపాలన విధానంలో కొంత ప్రత్యేకత చూపుతున్నాడనే చెప్పుకోవాలి. అధివృద్ది మాట అటుంచితే సంక్షేమ పథకాల విషయంలో చోరువ చూపిస్తూ పలు రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే ఉన్నారు. అయితే ఎక్కువగా నగదు పంపిణీ పథకాలు కావడంతో అటు ప్రతిపక్షాల నుంచి ఇటు ప్రజల నుంచి కొంత వ్యతిరేకత ఎదురవుతూనే ఉంది. ఇదిలా ఉంచితే జగన్ పై విమర్శలు చేసే ప్రతిసారి ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ శ్రేణులు.. ఎక్కువగా అక్రమాస్తుల విషయాన్ని తెరపైకి తెస్తుంటారు. జగన్ పై కూడా అక్రమాస్తుల విషయంలో పలు రకాల కేసులు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.

అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆయా పథకాల అమలులోను ఇంక చాలా వాటిలో కుంభకోణలు జరుగుతున్నాయని, టీడీపీ నేతలు తరుచూ ఆరోపిస్తున్నప్పటికి పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. కానీ తాజాగా టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ .. ” జగన్ తన పరిపాలనలో చేసిన అతిపెద్ద కుంభకోణాన్ని ” వచ్చే వారం బయటపెడతానని చెప్పుకొచ్చారు. మంగళగిరి లో ఆరోగ్యకేంద్రాన్ని ఏర్పాటు చేసిన తరువాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాల్లో పోలిటికల్ హీట్ పెరిగింది. లోకేశ్ ఏ కుంభకోణం గురించి ప్రస్తావిస్తాడు ? అందులో జగన్ పాత్ర ఏంటి ? అనే అంశాలపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

తరచూ జగన్ పై పరిపాలన పరంగా విమర్శలు చేసే లోకేష్.. ఈ సారి మాత్రం ” జగన్ అతిపెద్ద కుంభకోణాన్ని బయటపెడతానని, అది కూడా వచ్చే వారంలో బయటపెడతానని ” చెప్పడంతో లోకేష్ పక్క ఆధారాలతో జగన్ కుంభకోణాన్ని బయటపెట్టే అవకాశం ఉండని కొందరు అభిప్రాయ పడుతున్నారు. అయితే జగన్ కు సంభందించిన ఒకప్పటి కుంభకోణాలను లోకేష్ తిరిగి తెరపైకి తీసుకొస్తాడా ? లేదా ప్రస్తుతం జగన్ పరిపాలనలో జరుగుతున్నా పథకాల విషయంలో ఏమైనా కుంభకోణాలు జరుగుతున్నాయా ? లేదా ఇసుక పై జగన్ ప్రవేశ పెట్టిన విధానాలై అన్నీ వైపులా విమర్శలు వెల్లువెత్తుత్తున నేపథ్యంలో ఇసుక విషయంలో ఏమైనా జరుగుతున్నా కుంభకోణాలను లోకేష్ బయట పెట్టె అవకాశం ఉందా ? అనే ఇలాంటి ప్రశ్నలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికి లోకేష్ ఇచ్చిన స్టేట్మెంట్ తో ఒక్కసారిగా రాజకీయ వేడి రాజుకుంది.

Also Read

మీ వైరం అక్కడ కూడనా.. ఎంటిది ?

మోడీని దువ్వుతున్న బాబు..!

సర్వేల తీర్పు సమంజసమేనా ?

Related Articles

Most Populer

Recent Posts