Friday, May 3, 2024
- Advertisement -

మ‌మ‌త‌తో బాబు భేటీ…. పలు కీల‌క అంశాల‌పై చ‌ర్చ‌

- Advertisement -

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. కోల్ కతా చేరుకున్న ఆయనకు మమతాబెనర్జీ ఘన స్వాగతం పలికారు. అనంతరం భవిష్యత్ రాజకీయ కార్యాచరణ, , ప‌లు కీల‌క అంశాల‌పై ఇరువురు చర్చించారు. దీంతో వీరి భేటీకీ ప్రాధాన్య‌త ఏర్ప‌డింది. అనంత‌రం మోదీ పాల‌న‌పై నిప్పులు చెరిగారు.

కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేసినట్టు చంద్రబాబునాయుడు ఆరోపించారు. బీజేపీయేతర పార్టీలతో ఫ్రంట్ ఏర్పాటు గురించి బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో చర్చించినట్టు ఆయన చెప్పారు. త్వరలోనే ఢిల్లీలోబీజేపీయేతర పార్టీల సమావేశం ఉంటుంద‌ని తెలిపారు.

ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకొనేందుకు కలిసి నిర్ణయం తీసుకొంటామన్నారు చంద్రబాబునాయుడు.బీజేపీయేతర పార్టీలతో కలిసి పనిచేస్తున్నట్టు చెప్పారు. నోట్ల రద్దు నిర్ణయంతో సామాన్యులు తీవ్రంగా ఇబ్బందులు పడిన విషయాన్ని ఆయన మ‌రో సారి గుర్తు చేశారు. మహాకూటమి ఏర్పాటులో భాగంగా ఇప్పటికే చంద్రబాబు పలువురు నేతలను కలిసిన సంగతి తెలిసిందే. ఈ భేటీకి హాజరైనవారిలో అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి, సీఎం రమేష్ తదితరులు కూడా ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -