Tuesday, May 7, 2024
- Advertisement -

టీడీపీతో కాంగ్రెస్ పొత్తుతో ఎఫెక్ట్‌..కాంగ్రెస్ నుంచి మ‌రో వికెట్ డౌన్‌

- Advertisement -

వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ, కాంగ్రెస్ క‌ల‌సి పోటీ చేయాల‌ని నిర్ణ‌యించాయి. అయితే పొత్తుల వ్య‌వ‌హారంతో కాంగ్రెస్ పార్టీ కుదేల‌వుతోంది. సీనియ‌ర్ నేత‌లంతా పొత్తును వ్య‌తిరేకిస్తున్నా కాంగ్రెస్ అధిష్టానం కేర్ చేయ‌డంలేదు. ఇప్ప‌టికే పార్టీ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. క‌నీసం రాష్ట్రంలో బ్ర‌తికి బ‌ట్ట క‌ట్టాలంటే టీడీపీతో పొత్తు అవ‌స‌రం. అయితే దీన్ని వ్య‌తిరేకిస్తున్న నేత‌లంతా పార్టీని వీడుతున్నారు.

తాజాగా కాంగ్రెస్‌నుంచి మ‌రో వికెట్ ప‌డింది. మూడున్నర దశాబ్ధాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన మాజీమంత్రి బాలరాజు ఆపార్టీకి రాజీనామా చేశారు. ప్రస్తుతం విశాఖజిల్లా డీసీసీ అధ్యక్షుడుగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్‌ పార్టీ పొత్తును బాలరాజు తీవ్రంగా వ్యతిరేకించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాల్లో బాలరాజు గిరిజనశాఖ మంత్రిగా పని చేశారు. రాజీనామా లేఖ‌ను పార్టీ అధ్య‌క్షుడు రాహుల్‌కు పంపించారు. రేపు జ‌వ‌న్ స‌మ‌క్షంలో జ‌న‌సేన తీర్థం పుచ్చుకోనున్నారు.

ప్పటికే మరో కాంగ్రెస్ నేత, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కూడా జనసేనలో చేరిన సంగతి తెలిసిందే. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో, జనసేనలో నేతల చేరికలు ఊపందుకుంటున్నాయి. నాయ‌కుల చేరిక‌తో పార్టీలు బ‌లోపేతం అవుతుంటే కాంగ్రెస్ మాత్రం కుంచించుకు పోతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -