Monday, May 6, 2024
- Advertisement -

జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు చేసే వారు ఇప్పుడేమంటారు…

- Advertisement -

రాష్ట్రంలో కాపు రిజర్వేషన్లకు సంబంధించి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి.ప్ర‌స్తుతం రాజ‌కీయాలు దీని చూట్టూ తిరుగుతున్నాయి. అమలుకు సాధ్యంకాని హామీల్ని ఇవ్వలేను..’ అని జగన్‌ చేసిన వ్యాఖ్యల‌ను టీడీపీ, టీడీపీ అనుకూల మీడియా వక్రీకరించిన ఎలా దాడిచేసిందో అంద‌రికీ తెలిసిందే. కాపు నాయ‌కుడు ముద్ర‌గ‌డ ప‌ద‌ర్మ‌నాభం జ‌గ‌న్‌పై విరుచుకు ప‌డ్డారు.

2014 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌స్తే కాపుల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తామ‌ని హామీ ఇచ్చిన బాబు ప‌ట్టించేకోలేదు. కాపు ఉద్య‌మ‌నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ఒత్తిడితో అసెంబ్లీలో తూతూ మంత్రంగా రిజ‌ర్వేషన్ల‌పై బిల్ పాస్ చేయించి కేంద్రానికి పంపి చేతులు దులుపుకున్నారు.

నాలుగేళ్ళు కేంద్రంలో అధికారం పంచుకున్న తెలుగుదేశం పార్టీ, కాపు రిజర్వేషన్లను ఓ కొలిక్కి తీసుకురాలేకపోయిందంటే.. ఇది పూర్తిగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిగారి చేతకానితనమే. ఒకవేళ చేతకానితనం కాకపోతే, చంద్రబాబు కుట్రపూరిత వైఖరి అనుకోవాల్సి వుంటుంది.

గ‌త రెండు మూడు రోజుల‌నుంచి జ‌గ‌న్‌పై మాట‌ల‌దాడి జ‌రుగుతోంది. రిజ‌ర్వేష‌న్ల‌పై జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యం స‌రైన‌దేన‌ని ఆర్థిక మంత్రి య‌నుమ‌ల రామ‌కృష్ణుడు చేసిన వ్యాఖ్య‌లే నిద‌ర్శ‌నం. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగిందేమీ లేదు. ఏం చేయాలన్నా కేంద్రమే చేయాలి. కేంద్రం, రాజ్యాంగాన్ని మార్చాలి.. రాజ్యాంగాన్ని మార్చితే, కాపు రిజర్వేషన్లు సాధ్యమే..’ అని సెలవిచ్చారు యనమల రామకృష్ణుడు. రిజర్వేషన్ల అంశం, కేంద్ర పరిధిలో వుందని తెలిసీ, చంద్రబాబు 2014 ఎన్నికల్లో కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పిస్తామని ఎలా హామీ ఇచ్చారా అన్న‌ది చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహిస్తోన్న ప్రజాసంకల్ప యాత్రను అడ్డుకునేందుకు ‘కాపు రిజర్వేషన్ల’ వ్యవహారానికి మరింత మషాలా దట్టించి మరీ, తెలుగుదేశం పార్టీ నానా యాగీ చేస్తోన్న ఈ సమయంలో అదే తూర్పుగోదావరి జిల్లాకి చెందిన మంత్రి యనమల రామకృష్ణుడు.. ‘కాపు రిజర్వేషన్ల అంశం రాష్ట్ర పరిధిలోనిది కాదు..’ అని వ్యాఖ్యానించడంతో అంతా షాక్‌ అవ్వాల్సి వస్తోంది.

యనమల వ్యాఖ్యలతో, ఒక్కసారిగా వైఎస్సార్సీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కన్పిస్తోంది. కాపు రిజర్వేషన్ల విషయంలో టీడీపీ వైఖరేంటో యనమల వ్యాఖ్యల్లోనే స్పష్టమవుతోందని అంటున్నారు వైఎస్సార్సీపీ నేతలు. జ‌గ‌న్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేసిన ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం గారు ఇప్పుడేమంటారో చూడాలి..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -