Thursday, April 25, 2024
- Advertisement -

నిమ్మగడ్డ సంతోషపడేలోపే.. ఊహించని షాక్ ఇచ్చిన జగన్..?

- Advertisement -

ఏపీ ముఖ్యమంత్రి జగన్ వర్సెస్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో అసలు ట్విస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది. హైకోర్టు ఆదేశాల తర్వాత నిమ్మగడ్డను తిరిగి ఎస్‍ఈసీగా నియమించాలని జగన్ ప్రభుత్వంకు గవర్నర్ సూచించారు. అయితే ఇప్పుడు జగన్ ప్రభుత్వం నిమ్మగడ్డను ఎస్ఈసీగా నియమిస్తారనుకుంటే పొరపాటే.. ఎందుకంటే ఈ వ్యవహారం ముగిసిపోలేదు. అసలు ఆట ఇప్పుడే మొదలైందని చర్చ జరుగుతోంది.

గవర్నర్ ఆదేశాలు జారీచేసినా నిమ్మగడ్డ పునర్ నియామకం విషయంలో జగన్ ప్రభుత్వం ముందుకు వెళ్తుందా అనే అనుమానం కనిపిస్తోంది. సీఎం పట్టుబట్టి మరీ చంద్రబాబు నియమించిన నిమ్మగడ్డను తొలిగించారు. ఇప్పుడు నిమ్మగడ్డను మళ్లీ నియమిస్తే జగన్ ఓడిపోయినట్లే.. అందుకే నిమ్మగడ్డ విషయంలో జగన్ ఏం చేస్తారన్నది ఇప్పుడూ చర్చనీయంశం అయింది.

ఇప్పటికే సుప్రీం కోర్టులో అంతిమ తీర్పు రాకముందే తమ పరిధిలో లేదని హైకోర్టు గతంలో తేల్చిచెప్పిన వ్యవహారంలో తాము మాత్రం ఎందుకు తొందరగా నిర్ణయం తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం నిమ్మగడ్డ తొలగింపు ఆర్డినెన్స్ ను హైకోర్టు కొట్టిసింది. జస్టిస్ కనగరాజ్ నియామకంపై ఆర్డినెన్స్ మాత్రం ప్రభుత్వం కానీ గవర్నర్ కానీ ఉపసంహరించుకోలేదు. అంటే కనగరాజ్ ఆర్డినెన్స్ ఉపసంహరించుకోవడంతో పాటు నిమ్మగడ్డ నియామకంపై గవర్నరే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సుప్రీం కోర్టు తీర్పులో రెండు కేసులు పెండింగ్ లో ఉన్నాయి.

దాంతో హడావుడిగా నిర్ణయం తీసుకోలేమని గవర్నర్ కు ఏపీ సర్కార్ చెప్పే ఛాన్స్ ఉంది. గవర్నర్ ఇంకా జస్టిస్ కనగరాజ్ నియామక ఆర్డినెన్స్ ఉపసంహరించుకోవడం వంటి అంశాలు జగన్ సర్కార్ కు కలిసి వచ్చే అవకాశముంది. దాంతో ఇప్పట్లో ఈ వ్యవహరం తెలేలా లేదు. జగన్ సర్కార్ దీన్ని సాగదీసే కొద్దీ మరోసారి నిమ్మగడ్డ హైకోర్టును ఆశ్రయించే ఛాన్స్ ఉంది. ఈ వ్యవహారం అంత కోర్టులతోనే నెట్టుకొచ్చిన నిమ్మగడ్డకు అదే కోర్టులతో జాప్యం చేస్తూ నాల్చాలని జగన్ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

నిమ్మగడ్డకు ఆ డబ్బులు ఎవరిస్తున్నారు?

అంబటి రాంబాబుకి కరోనా పాజిటివ్..!

నారా బ్రాహ్మణికి ఊహించని షాక్ ఇచ్చిన సీఎం జగన్..!

బీసీల కోసం 52 కార్పొరేషన్లు.. జగన్ వరాల జల్లు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -