Saturday, April 20, 2024
- Advertisement -

ఏపి సీఎం జగన్ పాత కేసుల వ్యవహారం.. నేడు విచారణ చేపట్టనున్న హైకోర్టు!

- Advertisement -

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు నమోదైన 11 క్రిమినల్‌ కేసులను పోలీసులు, ఫిర్యాదుదారులు నిబంధనలకు విరుద్ధంగా ఉపసంహరించడాన్ని హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.లలిత ముందుకు బుధవారం విచారణకు రానున్నాయి. ఈ 11 కేసుల్లో అనంతపురం జిల్లాకు సంబంధించినవి ఐదు కాగా, గుంటూరులో నమోదైనవి ఆరు కేసులు ఉన్నాయి.

ఈ కేసులకు సంబంధించిన వివరాలు కోర్టు దృష్టికి రావడంతో హైకోర్టు పరిపాలన విభాగం వీటిని పరిశీలించి సుమోటోగా విచారణకు తీసుకుని హైకోర్టు రిజిస్ట్రీకి నంబర్లు కేటాయించింది. కాగా, జగన్‌పై నమోదైన పలు కేసులను కరోనా సమయంలో పోలీసులు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు (పీపీ), సంబంధిత న్యాయాధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఉపసంహరించారనే ఆరోపణలు ఉన్నాయి.

ఇదిలా ఉంటే అప్పట్లో అత్యవసరమైన కేసులు మాత్రమే విచారణకు చేపట్టాలని హైకోర్టు కూడా దిగువ కోర్టులను ఆదేశించింది. కానీ, అత్యవసరం కాకున్నా నిబంధనలు పాటించకుండా ఈ కేసులు ఉపసంహరించుకున్నట్లు హైకోర్టుకు ఫిర్యాదులు అందాయి. దీంతో హైకోర్టులో వీటిని సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది.

షాక్.. అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులపై రౌడీషీట్!

తన ఆఫీసులోని 200 మందికి వ్యాక్సిన్ వేయించిన దిల్ రాజు?

ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ వీసీగా తెలుగు తేజం కరణం మల్లీశ్వరి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -