Tuesday, April 16, 2024
- Advertisement -

షాక్.. అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులపై రౌడీషీట్!

- Advertisement -

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడుకి మరో షాక్ తగిలింది. ఇప్పటివరకు అక్రమ కేసులు.. అరెస్టులకు పరిమితమైన జగన్ సర్కార్ రౌడీషీట్ తెరిచే పనిలో పనిలో పడింది. బైండోవర్ కేసుల ఉల్లంఘన పేరుతో శ్రీకాకుళం ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులపై కోటబొమ్మాలి పోలీసులు రౌడీషీట్ ఓపెన్ చేశారు. అచ్చెన్న సోదరుడు, ఆయన కుమారుడు సురేష్, బంధువు కృష్ణమూర్తిపై పోలీసులు రౌడీషీట్ తెరిచారు.

2008లో నిమ్మాడలో కింజరాపు గణేష్‌ ఆధ్వర్యంలో పింఛన్ల పంపిణీ చేస్తుండగా, అప్పటి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు, ఆయన సోదరుడు హరివరప్రసాద్, అనుచరులు కింజరాపు కృష్ణమూరి తదితరులు గణేష్, అతని కుమార్తెపై దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో గణేష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వారిపై ఐపీసీ 354, 323, 506 సెక్షన్లు, ఐపీసీ 34 సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశారు. వీటితో పాటు మరొకొన్నికేసులు పెట్టారు.

2021 స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపించి.. కేసుల పెట్టారు. అప్పటి వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్‌ సాయంతో అప్పన్న నామినేషన్‌ వేసేందుకు వెళ్తుండగా వారిపై హత్యాయత్నం జరిగింది.

ఈ కేసులో కింజరాపు హరివరప్రసాద్, ఆయన కుమారుడు కింజరాపు సురేష్‌లపై 307, 353 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా ఉండేందుకు వారిపై రౌడీషీట్ తెరిచామని టెక్కలి సీఐ ఆర్‌.నీలయ్య, కోటబొమ్మాళి ఎస్‌ఐ రవికుమార్‌ తెలిపారు.

ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ వీసీగా తెలుగు తేజం కరణం మల్లీశ్వరి!

నేటి పంచాంగం,బుధవారం(23-06-2021)

చిత్రపరిశ్రమలో ఎన్నికల వేడి?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -