Friday, April 26, 2024
- Advertisement -

ప్రభుత్వానికి ఏకుకి మేకు లా తయారు అయిన హై కోర్టు..!

- Advertisement -

తెలంగాణ లో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ జరిపింది. పరీక్షలు, చికిత్స, నియంత్రణపై ప్రభుత్వం నివేదిక సమర్పించింది. మద్యం దుకాణాలు, థియేటర్లు, బార్లు, పబ్​లపై ఎందుకు ఆంక్షలు విధించడం లేదో తెలపాలని ఉన్నత న్యాయస్థానం సర్కారును ఆదేశించింది. ఆర్టీపీసీఆర్ పరీక్షలు అతి తక్కువగా చేస్తున్నారని… ప్రభుత్వం పూర్తిగా ర్యాపిడ్ టెస్టులపైనే దృష్టి పెట్టిందని కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

ఆర్టీపీసీఆర్ పరీక్షలు 10 శాతం కూడా లేవని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పరీక్షలు నెమ్మదిగా పెంచుతున్నామని అడ్వొకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. రెండో దశ వేగంగా విస్తరిస్తుంటే నెమ్మదిగా పెంచడమేంటని… ఆర్టీపీసీఆర్ పరీక్షలు పెంచాలని హైకోర్టు స్పష్టం చేసింది.

పెళ్లిళ్లు, అంత్యక్రియల్లో జనం గుమిగూడకుండా చూడాలని న్యాయస్థానం సర్కారును ఆదేశించింది. కరోనా పాజిటివ్, మరణాల రేటు వెల్లడించాలని పేర్కొంది. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, నిర్మాణ ప్రాంతాల్లో పరీక్షల వివరాలు తెలపాలని… కరోనా చికిత్స కేంద్రాల వివరాలపై విస్తృత ప్రచారం చేయాలని ప్రభుత్వానికి సూచించింది.

అనాథ, వృద్ధాశ్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించింది. కరోనా నిబంధనలు పాటించని వారి వివరాలు తెలపాలన్న హైకోర్టు… నమోదైన కేసులు, జరిమానాల వివరాలు తెలపాలని పేర్కొంది. 48 గంటల్లో నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

మళ్లీ పూజలలో కి కేసిఆర్.. హల్దీవాగులోకి కొత్త నీరు..!

క్యూలో నిల్చుని ఓటేసిన తెలంగాణ గవర్నర్ తమిళిసై..

పెట్రో డీజిల్ రేట్స్ కి నిరసనగా సైకిల్ మీద వచ్చి ఓటు వేసిన హీరో విజయ్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -