అందరు అనుకున్నట్లుగానె నంద్యాల ఉప ఎన్నిక తర్వాత రాష్ట్ర రాజకీయాలలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గెలుపు టీడీపీకి బూస్ట్ ఇవ్వగా ప్రతిపక్ష పార్టీలో మాత్రం ప్రకంపనలు రేపుతోంది. వైసీపీనుంచి టీడీపీలోకి వలసలు ప్రారంభమయ్యాయనె వార్తలు వినిపి స్తున్నాయి. జగన్ పార్టీనుంచి 11 మంది ఎమ్మెల్యలే పార్టీ మారుతున్నారె వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పుడు తాజాగా నెల్లూరు జిల్లాలో మరో సారి ప్రతిపక్షానికి భారీ షాక్ తగిలింది.
విజయవాడలో జరిగిన ప్లీనరీలో వైసీపీ అధినేత జగన్ నవరత్నాలు అనే పథకాలను ప్రకటించారు. ఈ పథకాలను ప్రజలల్లోకి తీసుకెల్లేందుకు ‘అన్న వస్తున్నాడు’ కార్యక్రమం ద్వారా అక్టోబర్ 27 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. తాజాగా నెల్లూరు జిల్లా కావలిలో జగన్ తెరపైకి తీసుకొచ్చిన ‘నవరత్నాలు’ హామీల కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా నిన్న స్థానిక ఆర్ఎస్ఆర్ కల్యాణమంటపంలో ఈ సభను ఏర్పాటు చేశారు. అయితే ఈసభకు ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, వంటేరు వేణుగోపాల్ రెడ్డిలు డుమ్మాకొట్టడంతో … ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్యర్యంలో జరిగిన ఈ సభకు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డిలు హాజరయ్యారు. గైర్హాజరైన ఇద్దరు నేతలకూ ఆహ్వానం పలుకుతూ ఫ్లెక్సీలు కూడా కట్టారు. అయినప్పటికీ, వీరిద్దరూ గైర్హాజరు కావడంతో… పార్టీలోని విభేదాలు మరోసారి వెలుగు చూసినట్టైంది. దీంతో పార్టీని వీడతారనె సంకేతాలు వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.
