Friday, April 26, 2024
- Advertisement -

ప్రధాని పదవిని మోడీ దిగజారుస్తున్నారా ?

- Advertisement -

దేశంలో ప్రధాన జాతీయ పార్టీలుగా ఉన్న బీజేపీ, కాంగ్రెస్ మద్య ఎప్పుడు కూడా పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేంతలా రాజకీయ రగడ కొనసాగుతూనే ఉంటుంది. అయితే ప్రస్తుతం బీజేపీ తరుపున నరేంద్ర మోడీ బలమైన నాయకుడిగా ఉన్నారు. కానీ కాంగ్రెస్ తరుపున సోనియా గాంధీ తరువాత ఆ స్థాయిలో బలమైన నాయకత్వం కొరత ఉందనే చెప్పాలి. దాంతో కాంగ్రెస్ పూర్వ వైభవానికి మసకబారిందనే చెప్పాలి. అయితే కాంగ్రెస్ భవిష్యత్త్ నాయకుడిగా సోనియా గాంధీ తనయుడు రాహుల్ గాంధీ లిస్ట్ లో ఉన్నప్పటికి, రాజకీయాల పట్ల ఆయన వైఖరి ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి.

అయితే ఈ మద్య కాలంలో రాహుల్ గాంధీ పోలిటికల్ గా ఫుల్ యాక్టివ్ గా ఉన్నారు. తరచూ మోడీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ, విమర్శనస్త్రాలు సంధిస్తున్నారు. దేశంలో పెరిగిన ధరలకు వ్యతిరేకంగా ఈ నెల 5వ తేదీన కాంగ్రెస్ నేతలు నల్ల దుస్తులు ధరించి నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ నేతల నిరసనను ఉద్దేశించి తాజాగా ప్రధాని మోడీ ఓ కార్యక్రమంలో విమర్శలు సంధించారు.. ” ప్రజల నమ్మకాన్ని కోల్పోయిన వారు తిరిగి ఆ నమ్మకాన్ని పొందలేరని, నల్ల దుస్తులు ధరించి రాజకీయం చేస్తున్న వారిపై ప్రజల్లో నమ్మకం లేదని ” మోడీ వ్యాఖ్యానించారు.

అంతే కాకుండా మూఢ నమ్మకాలను తాము నమ్మినప్పటికి, ప్రజల్లో నమ్మకం కోల్పోయిన వారిపై ప్రజలు ఎప్పటికీ నమ్మరని” మోడీ చెప్పుకొచ్చారు. అయితే మోడీ చేసిన వ్యాఖ్యల పట్ల రాహుల్ గాంధీ గట్టిగానే స్పంధించారు. ” ప్రధాని మోడీ దేశంలో ఏర్పడిన నిరుద్యోగ కొరత, పెరిగిన ధరలను గుర్తించలేదా ? మీరు చేస్తున్న ఈ అక్రమ విధానాలను మరుగుపరచడం కోసం చేతబడి, మూఢనమ్మకాలు వంటి నిరర్థకమైన వాటిని ప్రస్తావించి, ప్రధాని మంత్రి పదవికి ఉన్న ఔనత్యాన్ని, హుందాతనాన్ని దిగజార్చకండి. ముందు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు సమాధానం చెప్పండి.” అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం రాహుల్ గాంధీ ట్విట్టర్ లో చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Also Read

మోడీ భవిష్యత్త్ ప్రత్యర్థి.. అతనేనా ?

తప్పు.. ప్రభుత్వానిదా..ప్రతిపక్షాలదా ?

మన దేశం చుట్టూ ఎందుకిలా జరుగుతోంది ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -