Tuesday, April 23, 2024
- Advertisement -

మోడీ భవిష్యత్త్ ప్రత్యర్థి.. అతనేనా ?

- Advertisement -

జాతీయ రాజకీయాల్లో మోడీ వ్యూహాలకు విపక్షాలు కుదేలైన సందర్భాలు చాలానే ఉన్నాయి. తన వాక్చాతుర్యంతో విపక్షాలపై చేసే విమర్శలు ఎప్పుడు కూడా హాట్ టాపిక్ గానే నిలుస్తుంటాయి. ఇక విపక్షాలు సైతం మోడీ విమర్శలలను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో వెనుకంజ వేస్తూనే ఉంటాయి. అంతలా మోడీ తన వాక్చాతుర్యంతో విపక్షలను ఇరుకున పెడుతూ ఉంటారు. అలాంటి మోడీ చతురతనే ఇరుకున పెట్టె విధంగా డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ వైఖరి ఉండడం జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మోడీ కేజ్రివాల్ మద్య నెలకొన్న ఉచితల రగడ ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉంది..

ఆ మద్య మోడీ మాట్లాడుతూ.. ఉచిత పథకాల వల్ల దేశ అభివృద్ది లోపిస్తుందని, అవి దేశానికి మంచిది కాదని వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలు తమ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసినవేనవేనని ఆ మద్య కేజ్రివాల్ చెప్పుకొచ్చారు. ప్రజలకు అవసరమయ్యే విద్యా, వైద్యం, వంటి సదుపాయాలను ఉచితంగా ఇవ్వడం ఏమాత్రం తప్పుకాదని మోడీకి కౌంటర్ గా కేజ్రివాల్ వ్యాఖ్యానించారు. ఇక తాజాగా మోడీ వ్యాఖ్యలనుద్దేశించి కేజ్రివాల్ మరోసారి రియాక్ట్ అయ్యారు. సంక్షేమ పథకాల పట్ల వ్యతిరేక వాతావరణం సృష్టించేందుకు కొందరు నేతలు కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. సమాజంలో సమానత్వం కోసం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలను ఉచితలుగా చూడవద్దని కేజ్రివాల్ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు.

ప్రజలకు ఉపయోగకరంగా ఉండే ఉచిత విద్యా, వైద్య వంటి పథకాలను ఆపేందుకు చేసే ప్రయత్నాలు మాని, బ్యాంకుల్లో లక్షల కోట్లు ఎగ్గొడుతున్న ద్రోహులపై ముందు విచరణ జరపండి అంటూ డిమాండ్ చేశారు కేజ్రివాల్. అయితే మోడీ – కేజ్రివాల్ మధ్య జరుగుతున్న ఉచితల వార్ చూసినట్లైతే గతంలో ఎన్నడూ లేని మోడీ ఫోకస్ అంతా కేజ్రివాల్ పైనే ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి కారణం కూడా లేకపోలేదు.. ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీగా చాప కింద నీరులా విస్తరిస్తోంది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ తరువాత బీజేపీకి ప్రధాన ప్రత్యర్థిగా ఆమ్ ఆద్మీ నిలిచే అవకాశం ఉంది. దాంతో ఇప్పటి నుంచే ఆమ్ ఆద్మీ విధానపై గట్టిగా దెబ్బకొట్టేందుకు మోడీ వ్యూహాలు రచిస్తున్నట్లు కొందరు విశ్లేషకులు చెబుతున్నా మాట.

Also Read

తూచ్.. గురంట్లపై చర్యలు తీసుకోవట్లే ..!

బ్రదర్స్ పై గురిపెడుతున్న బిజెపి !

ఆ విషయంలో.. మాట తప్పిన మోడీ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -