తప్పు.. ప్రభుత్వానిదా..ప్రతిపక్షాలదా ?

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయంటే దేశ వ్యాప్తంగా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కుతాయి. ఎందుకంటే ఆ ఏడాది లో తీసుకొచ్చిన విధానాలపై అలాగే కొత్తగా చేపట్టబోయే పథకాల గురించి, ప్రవేశ తెట్టబోయే బిల్లుల గురించి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సమావేశాలలో ప్రకటిస్తుంది. ఇక ప్రతిపక్షాల విషయానికొస్తే.. ఆ ఏడాదిలో చేపట్టిన పథకాలలోని లొసుగులను, అలాగే ప్రభుత్వం వేసిన తప్పటడుగులనూ నిలదీస్తు ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేసేందుకు ప్రతిపక్షాలు కూడా పార్లమెంట్ సమావేశాలకు సిద్దమౌతు ఉంటాయి.

అయితే ఈ ఏడాది ఇటీవల ప్రారంభం అయిన వర్షకాల సమావేశాలలో ఆన్యుహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా జి‌ఎస్‌టి పెరుగుదల, తీవ్ర దుమారం రేపిన అగ్నిపథ్ వంటి కీలక అంశాలపై ఎలాంటి చర్చ లేకుండానే పార్లమెంట్ సమావేశాలకు ముగింపు పలికాయి. ఈ నెల 14 వరకు కొనసాగాల్సిన పార్లమెంట్ సమావేశాలు 8వ తేదికే నిర్వాధికంగా వాయిదా పడ్డాయి. ఒకింత ఇది ఆశ్చర్యం కలిగించే విషయమనే చ్ప్పుకోవాలి. ఎందుకంటే జే‌ఎస్‌టి పెరుగుదలపై, ధరల పెరుగుదలపై ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీవ్రమైన విమర్శలు వచ్చాయి.

దీనిపై చర్చ ఉంటుందని భావించరంతా.. కానీ ఈ అంశంపై చర్చ జరగకుండా కేంద్ర ప్రభుత్వం జాగ్రత్త పడింది. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు చేసిన ప్రయత్నలేవీ ఫలించలేదు. ముఖ్యంగా కాంగ్రెస్ సీనియర్ నేత అధిర రంజన్ రాష్ట్రపతి ని కించపరిచే విధంగా ” రాష్ట్రపత్ని” అనడం దాంతో సభ గందరగోళానికి గురై సభను వాయిదా వేయడంలో కేంద్ర ప్రభుత్వం సక్సస్ అయింది. దాంతో చర్చకు రావలసిన కీలక అంశాలన్నీ పక్కదారి పట్టాయి. జే‌ఎస్‌టి పెరుగుదలపై కేంద్ర ప్రభుత్వ సమాధానాలు వినాలని ఎదురు చూసిన దేశ ప్రజలకు అసహనమే మిగిలింది. మరి ప్రజలు తెలుసుకోవాల్సిన కీలక అంశాలను చర్చకు రాకుండా చేయడంలో తప్పు.. ప్రభుత్వానిదా ? ప్రతిపక్షాలదా ? అని సామాన్యుడు నిలదీసే పరిస్థితి ఏర్పడింది.

Also Read

ఆ విషయంలో.. మాట తప్పిన మోడీ !

మోడీ అమిత్ షా మాస్టర్ ప్లాన్ .. ఆ రాష్ట్రంపై !

మోడీ తలుచుకుంటే.. జగన్ వెనక్కు తగ్గుతాడా ?

Related Articles

Most Populer

Recent Posts