Friday, May 3, 2024
- Advertisement -

ఓటుకు 5 వేలు.. సరిపోవంటే 10 వేలు తీసుకోండి!

- Advertisement -

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పంచాయ‌తీ ఎన్నిక‌ల వేడి రాజుకుంటోంది. ఇప్ప‌టికే అధికార, ప్ర‌తిప‌క్ష పార్టీల మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతోంది. ఏక‌గ్రీవాల‌పై కూడా పెద్ద ఎత్తున చ‌ర్చ నడుస్తోంది. పార్టీ ప్ర‌స్తావ‌న లేని ఈ ఎన్నిక‌ల్లో త‌మ మ‌ద్ద‌తుదారులే గెలుస్తారు… వార్ వ‌న్‌సైడ్ అవుతుంద‌ని వైఎస్సార్ సీపీ నేత‌లు ధీమాగా ఉన్నారు. ఇదిలా ఉంటే… ఎంత‌కు బ‌రితెగించైనా స‌రే, ప‌ల్లెల్లో చిచ్చు పెట్టైనా స‌రే పంతం నెగ్గించుకోవాల‌న్న‌ట్లుగా ఉంద‌ని టీడీపీ రాష్ట్ర అచ్చెన్నాయుడు వ్య‌వ‌హారమే బ‌య‌ట‌పెట్టింది.

రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థిపై దాడి కేసులో అరెస్టై ఇప్పుడు ఆయ‌న శ్రీకాకుళం జిల్లా జైల్లో రిమాండ్‌ ఖైదీ నంబర్‌ 8775గా జైలు జీవితం గ‌డుపుతున్నారు. వైఎస్సార్ సీపీ, టీడీపీ తీరు ఇలా ఉంటే.. బీజేపీ సైతం మ‌ద్ద‌తుదారుల‌ను కూడ‌గ‌ట్టేందుకు త‌న వంతు ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టేసింది. ఓటుకు ఏకంగా రూ. 5 వేలు పంచుతూ ఎన్నిక‌ల బ‌రిలో నిల‌వాల‌ని గ‌ట్టి ప్ర‌య‌త్నాలే చేస్తోంది. నెల్లూరు జిల్లా నియోజకవర్గంలో కావలి, అల్లూరు, బోగోలు, దగదర్తి మండలాల పరిధిలో సర్పంచ్‌ స్థానాలకు త‌మ త‌ర‌ఫున కొంత‌మందితో బీజేపీ నామినేష‌న్లు వేయించింది.

అస‌లు వారంతా రాజ‌కీయాల‌కు కొత్త. స్థానికంగా కూడా వారికి ఎలాంటి మ‌ద్ద‌తు కూడా లేదు. దీంతో డ‌బ్బు వెద‌జ‌ల్లి ఎలాగైన ఉనికి చాటుకునేందుకు పార్టీ శ్రేణులు తెగ‌బ‌డ్డాయి. వ‌ద్ద‌న్నా స‌రే, ఓ చోట అంద‌రికీ క‌లిపి 1.24 లక్షలు ఓట‌ర్ల ఇంట్లో పెట్టిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. దీనిని ఓట‌ర్లు అధికారుల‌కు అప్పగించడ‌మే గాక‌, నోట్లు పంచిన వారిపై ఫిర్యాదు కూడా చేశారట‌. అయిన‌ప్ప‌టికీ వెన‌క్కిత‌గ్గ‌క ఓటుకు 10 వేలు ఇస్తామ‌ని బేర‌సారాల‌కు దిగుతున్నార‌ట‌. ఇలా ఉంది మ‌రి బీజేపీ నేత‌ల వ్య‌వ‌హారం!

కోహ్లీపై మండిపడుతున్న నెటిజన్లు!

అచ్చెన్న అరెస్టుపై బాబు మాటలు మిస్ ఫైర్!

ఇదిగో ఈ న్యూడ్ ఫొటో చూడు అన్న బుట్ట‌బొమ్మ‌

పార్టీ ఉండ‌క‌పోవ‌చ్చు.. కానీ ప్ర‌జ‌ల ప‌క్షాన ఉంటా..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -