Wednesday, April 17, 2024
- Advertisement -

బ్రదర్స్ పై గురిపెడుతున్న బిజెపి !

- Advertisement -

ప్రస్తుతం తెలంగాణలో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం యమ దూకుడు మీద ఉన్న బీజేపీ.. మరింతగా బలం పెంచుకుంటూ దూసుకుపోతోంది. ముఖ్యంగా చేరికల విషయంలో బీజేపీ అనుసరిస్తున్న వ్యూహం హాట్ టాపిక్ గానే నిలుస్తోంది. చేరికల కమిటీ చైర్మెన్ ఈటెల రాజేందర్ అధ్వర్యంలో ఇతర పార్టీలలోని కీలక నేతలను బీజేపీ వైపు ఆకర్షించడంలో సక్సస్ అవుతున్నారు కమలనాథులు. ఇప్పటికే కాంగ్రెస్ లోని సీనియర్ నేతలు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, దాసోజు శ్రవణ్ వంటి వారిని బీజేపీలో కలుపుకోని ఇతర పార్టీలకు గట్టిగానే షాక్ ఇచ్చింది కాషాయదళం.

ఇక అధికార టి‌ఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు కూడా ఇటీవల టి‌ఆర్‌ఎస్ కు రాజీనామా చేశారు. ఆయన కూడా త్వరలోనే కాషాయ కండువా కప్పుకొనున్నారు. ఊహించని రీతిలో చేరికలు ఉంటాయని చెప్పిన కమలనాథులు ఇతర పార్టీలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఇక ప్రస్తుతం బీజేపీ గురి మరో ఇద్దరి బ్రదర్స్ పై పడినట్లు తెలుస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే బీజేపీ గూటికి చేరగా, ఆయన బ్రదర్ కోమటిరెడ్డి వెంకట రెడ్డిని కూడా బీజేపీ వైపు ఆకర్శించేందుకు కమలనాథులు ప్రయత్నాలు చేస్తున్నారట. ఆయన కాంగ్రెస్ వీడే ప్రసక్తే లేదని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసినప్పటికీ, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వైఖరి పట్ల తీవ్ర అసహనం చూపుతున్నారు.

ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారిన ఆశ్చర్యం లేదనే వాదనలు కూడా బలంగానే వినిపిస్తున్నాయి. ఇక టి‌ఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఎర్రబెల్లి ప్రదీప్ రావు కూడా బీజేపీ గూటికి చేరుతుండడంతో.. ఆయన సోదరుడు టి‌ఆర్‌ఎస్ కీలక నేత ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా టి‌ఆర్‌ఎస్ కు గుడ్ బై చెప్తాడా ? అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనప్పటికి చేరికల విషయంలో యమ దూకుడుగా వ్యవహరిస్తున్న బీజేపీ ముందు రోజుల్లో ఇతర పార్టీలకు మరికొంత మంది కీలక నేతలను బీజేపీలో కలిపేసుకునే అవకాశాలు గట్టిగానే కనిపిస్తున్నాయి.

Also Read

టార్గెట్ రేవంత్ రెడ్డి.. కారణం ఆదేనా ?

మునుగోడు కంటే ముందే.. ముందస్తు ఎన్నికలా ?

ఈటెల కామెంట్స్ వెనుక ఆంతర్యం ఏంటి ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -