మునుగోడు కంటే ముందే.. ముందస్తు ఎన్నికలా ?

ప్రస్తుతం తెలంగాణలో మునుగోడు చుట్టూ పోలిటికల్ హీట్ తీవ్ర స్థాయిలో ఉంది. మునుగోడు ఎమ్మెల్యే కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయడంతో మునుగోడులో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికపై బీజేపీ కాన్ఫిడెంట్ గా ఉన్నప్పటికి కాంగ్రెస్, టి‌ఆర్‌ఎస్ పార్టీలకు మాత్రం కత్తి మీద సాముగా మారాయి. ముఖ్యంగా అధికార పార్టీ టి‌ఆర్‌ఎస్ కు ఈ ఉప ఎన్నిక చాలా కీలకం కానున్నాయి. ఇప్పటికే దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల్లో బీజేపీ ద్వారా కంగు తిన్న టి‌ఆర్‌ఎస్ పార్టీ ఈ ఉపఎన్నికల్లో కూడా పట్టు ఓడిపోతే ఆ ప్రభావం వచ్చే ఏడాది జరిగే సాధారణ ఎన్నికలపై గట్టిగా పడుతుంది. దాంతో ఈ ఉప ఎన్నికపై కే‌సి‌ఆర్ మరియు టి‌ఆర్‌ఎస్ శ్రేణులు మదనపడుతున్నారని తెలంగాణ పోలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తున్న మాట.

ఎందుకంటే మునుగోడు నియోజిక వర్గంలో టి‌ఆర్‌ఎస్ కు పట్టు లేదు.. ఎంత బలమైన అభ్యర్థిని భరిలో నిలబెట్టిన గెలుపుపై ఆశలు అనుమానమే.. ఎందుకంటే ఇప్పటికే మునుగోడులో సత్తా చాటుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపి తరుపున బరిలో నిలవనున్నారు. దాంతో బీజేపీ గెలుపుపై చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. ఒకవేళ మునుగోడు ఉపఎన్నికల్లో బీజేపీ గెలిస్తే.. ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు అనే సంకేతాలను కమలనాథులు బలంగా పంపించే అవకాశం ఉంది. అంతే కాకుండా టి‌ఎస్ బీజేపీ చీఫ్ బండి సంజయ్ రాష్ట్రంలో మునుగోడు తరువాత మరిన్ని ఉపఎన్నికలు వచ్చే అవకాశం ఉంది అని చెప్పడంతో.. ఉప ఎన్నికల ద్వారా పట్టు సాధిస్తూ వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాన్ని స్థాపించేది తామే అని చెప్పేందుకు కమలనాథులు వ్యూహాలు రచిస్తున్నారు. దాంతో టి‌ఆర్‌ఎస్ మనుగడ కొనసాగలంటే మునుగోడు ఉపఎన్నిక చావో రేవో అన్న పరిస్థితి ఏర్పడింది.

ఈ నేపథ్యంలో గెలుపుపై ఆశ లేని మునుగోడుపై ఫోకస్ చేసే కన్న.. మునుగోడు ఉపఎన్నిక కంటే ముందే అసెంబ్లీ రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుందనే దానిపై కే‌సి‌ఆర్ ఫోకస్ చేస్తున్నారట. ఇప్పటినే ముందస్తు ఎన్నికలకు సంభంచించి కే‌సి‌ఆర్ పలుమార్లు ప్రకటనలు కూడా చేసిన సంగతి తెలిసిందే. అటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా ముందస్తు ఎన్నికలు ఎప్పుడు వచ్చిన సిద్దమే అని కూడా ప్రకటించాయి. అయితే ఆ మద్య కే‌టి‌ఆర్ ముందస్తు ఎన్నికలకు వెల్లసిన అవసరం తమకు లేదని స్పస్టం చేసినప్పటికీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. ముందస్తు ఎన్నికలు ఒక్కటే టి‌ఆర్‌ఎస్ ముందు ఉన్న బెస్ట్ ఆప్షన్ అంటూ విశ్లేషకులు చెబుతున్నారు. మరి మునుగోడు ఉప ఎన్నికతో మళ్ళీ తెరపైకి వచ్చిన ముందస్తు ఎన్నికల వ్యవహారంపై సి‌ఎం కే‌సి‌ఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.

Also Read

బండి సంజయ్ మైండ్ గేమ్ స్టార్ట్ చేశాడా ?

కుప్పం జగన్ అడ్డాగా మారుతుందా ?

మోడీ అమిత్ షా మాస్టర్ ప్లాన్ .. ఆ రాష్ట్రంపై !

Related Articles

Most Populer

Recent Posts