Wednesday, May 8, 2024
- Advertisement -

భజన చేయడం. తాలాలు వాయించడంలో ఆయనకు ఆయనే సాటి..?

- Advertisement -

కొన్ని కొన్ని రంగాల్లో భజన చేయడం. తాలాలు వాయించడం వంటి మాటలు మనం నిత్యం చూస్తూనే ఉంటాము.. ఇవి చేసిన వారు ఎంతో తొందరగా పైకి వస్తారో అవి చేయని వారు ఏళ్ళు గడిచిన అక్కడే ఉంటారనేది అక్షర సత్యం.. ఇక రాజకీయాలో, సినీ రంగాల్ల్లో అయితే ఇవి చేసినోడికి చేసుకున్నంత అదృష్టం.. ఎందుకంటే ఎ మనిషి అయినా పొగడ్త అంటే ఎందుకు పడిపోడు చెప్పండి.. మరీ పరిమంది లో పొగిడితే మాత్రం వారికి ఉండే సంతోషం వేరు.. అప్పటి దాకా ఒకలాగా కనిపించిన ఆ మనిషి అప్పటినుంచి స్పెషల్ గా కనిపించడం మొదలవుతుంది.

ఇక టీడీపీ లో భజన బ్యాచ్ ల సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు.. చంద్రబాబు శివుడిగా, లోకేష్ ను వినాయకుడిగా అభివర్ణిస్తూ అదంతా డోలు వాయిస్తున్నారని తెలిసినా వారిని ఎత్తిన చోటకి ఎత్తకుండా ఎత్తేస్తుంటారు.. అయితే ఇది వారిద్దరికీ అర్థమవుతుందో లేదో కానీ వారు ఎవరైతే తమని ఆకాశానికి ఎత్తేస్తారో వారికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ పార్టీ లో మంచి మంచి పదవులు అంటగడుతుంటారు.. ఇక సిన్సియర్ గా పనిచేసిన వారు టీడీపీ గేట్ దగ్గరే జెండా పట్టుకుని నిలిచుండాలి..

అయితే టీడీపీ లో ఈ తరహా రాజకీయాలు చేసే వారిలో ముందు వరసలో ఉండేది బుద్ధ వెంకన్న గారని చెప్పాలి.. ఎందుకంటే అయన చంద్రబాబు ను పొగడం చూస్తే ఎదుటివారికి అది ఎబ్బట్టుగా అనిపించినా అయన మాత్రం ఆవిషయం అధిష్టానాన్ని మెప్పించిన లేదా అని ఓ కంట గమనిస్తుంటారు.. తాజాగా ఆయనకు కరోనా రాగ అది ఈమధ్య తగ్గింది.. దానికి అయన చెప్పిన సమాధానం చూస్తే ఈ రేంజ్ లో డప్పు కొట్టే వాడు ఈ రాష్ట్రంలో లేరని అంటారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే ” నా ప్రత్యక్ష దైవం చంద్రబాబు గారిచ్చిన దిర్యం, అభిమానుల ప్రార్ధన, వల్లే నేను ఇంత త్వరగా కోలుకోగలిగాను. మా నాయకుడిని నమ్ముకుని ముందుకు వెళ్లడమే నా ధ్యేయం.. కష్టకాలంలో చంద్రబాబు గారిచ్చిన మనోధైర్యం, అండ జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను ” అని ఆయన చెప్పిన తీరు చూస్తే ఆయనకొచ్చిన కరోనా ని చంద్రబాబే తరిమికొట్టినట్లు ఉంది..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -