Friday, April 26, 2024
- Advertisement -

క‌ర్నూలు వైసీపీ ఎంపీగా పోటీ చేసేది ఈనేనా…అందుకె జ‌గ‌న్ లైట్ తీసుకున్నారా..

- Advertisement -

క‌ర్నూలు రాజ‌కీయాలు ఎవ‌రికి అంతుప‌ట్ట‌కుండా ప్ర‌తిప‌క్ష‌, అధికార పార్టీల్లో రోజు రోజుకి మారిపోతున్నాయి. త‌మ ప‌ట్టును పెంచుకొనేందుకు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. వైసీపీ ఎంపీ బుట్టారేణుక టీడీపీలోకి వెల్ల‌డం క‌న్ప‌మ్ అవ‌డంతో అదే జిల్లాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య‌ప్ర‌కాశ్ రెడ్డి వైసీపీలో వ‌చ్చేందుకు సిద్ధంగా ఉన్నార‌నె ఆర్త‌లు వినిపిస్తున్నాయి. దాంతో ఇరుపార్టీల్లోనూ రాజకీయ సమీకరణలు చాలా వేగంగా జరగనున్నట్లు సమాచారం.

అయితె ఇద్ద‌రు నేత‌లు పార్టీ మార‌డం వెనుక చాలా కార‌ణాలున్నాకార‌ణాలున్నాయి. బుట్టా విషయంలో కారణాలను పక్కన బెడితే కోట్ల విషయంలో వినిపిస్తున్న కారణాలు మాత్రం సబబుగానే ఉన్నాయి. విభ‌జ‌న త‌ర్వాత కాంగ్రెస్ పరిస్థితి పూర్తిగా క‌నుమ‌రుగు స్థాయిలో ఉంది. భ‌విష్య‌త్తులో కూడా లేక‌పోవ‌డంతో కాంగ్రెస్ నేత‌లు ఇత‌ర పార్టీల‌వైపు చూస్తున్నారు. అందుకె వచ్చే ఎన్నికలకు కూడా కాంగ్రెస్ లోనే ఉండాలనుకుంటే తమకు తామే ఘోరీ కట్టేసుకున్నట్లే. అందుకు కర్నూలు జిల్లాలో కోట్ల కుటుంబం కూడా మినహాయింపు కాదు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లా సూర్య ప్ర‌కాశ్ టీడీపీలో చేరే అవ‌కాశాలు దాదాపు లేన‌ట్లే. అయ‌న‌కు వైసీపీ త‌ప్ప మ‌రో ప్ర‌త్యామ్నాయంలేద‌నె చెప్పాలి. ఇదే విషయమై కోట్ల-జగన్ మధ్య రాయబారం కూడా జరిగిందట. బుట్టా టిడిపిలోకి ఫిరాయిస్తే వైసీపీ ఎటూ కొత్త అభ్యర్ధిని వెతుక్కోవాల్సిందే. అభ్యర్ధులంటే ఉంటారు కానీ గట్టి అభ్యర్ధులంటే దొరకటం కష్టమే. అదే సమయంలో కోట్ల కుటుంబానికి గట్టి పార్టీ కూడా అవసరమే. అంటే ఇటు జగన్ కైనా అటు కోట్ల కుటుంబానికైనా ఒకరి అవసరం మరొకరికుంది.

ఇప్పటికిప్పుడు కోట్ల వైసీపీలో చేరకపోవచ్చు కానీ చేరటమైతే ఖాయం. కోట్ల వైసీపీలో చేరే విషయం ఖాయమైన తర్వాతే బుట్టా ఫిరాయింపును జగన్ తేలిగ్గా తీసుకున్నారని సమాచారం. ఎన్నికలు దగ్గరపడే కొద్దీ ఇంకెన్ని సిత్రాలు జరుగుతాయో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -