Thursday, May 9, 2024
- Advertisement -

రేవంత్ రెడ్డిపై విమ‌ర్శ‌లు చేస్తె బాబు చిక్కుల్లో ప‌డ‌టం ఖాయ‌మా….?

- Advertisement -

తెలంగాణా టీడీపీలో ముస‌లం మొద‌ల‌య్యింది. పార్టీ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతున్నార‌నె వార్త‌ల నేప‌ధ్యంలో బాబులో ఆందోళ‌న మొద‌ల‌య్యింది. ఇప్ప‌టి వ‌ర‌కు బ‌హిరంగంగా ఎక్క‌డా పార్టీ మారుతున్నాని రేవంత్ ప్ర‌క‌టించ‌లేదు. నిజానికి టీడీపీ అనుకూల మీడియాలోనె వార్త‌లు ప్ర‌సారం అయ్యాయి.

త్వరలో రాహుల్‌గాంధీకి కాంగ్రెస్‌ పార్టీ ‘అధ్యక్షుడిగా’ బాధ్యతలు అప్పగించనున్న నేప‌థ్యంలో అధ్య‌క్ష‌హోదాలో మొద‌టిసారిగా తెలంగాణలో పర్యటిస్తారనీ, ఆ పర్యటనలోనే రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకుంటారనీ టీడీపీ అనుకూల మీడియాలోనే ఊహాగానాలు ఇంకా విన్పిస్తున్నాయి. సాక్షాత్తు త‌న అనుకూల మీడియా ద్వారానె వార్త‌లు వ‌స్తున్నాయి.

ఇదంతా బాగానె ఉన్నా రేవంత్ రెడ్డి పార్టీ మారితె టీడీపీ అధినేత చంద్ర‌బాబుతోపాటు ఇత‌ర నేత‌లు ప్ర‌శ్నించ‌గ‌ల‌రా అన్నది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మారింది. రేవంత్‌రెడ్డిని విమర్శిస్తే ఏమవుతుందో టీడీపీకే బాగా తెలుసు. ఎందుకంటే, ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డి ప్రధమ నిందితుడే అయినా, తెరవెనుక వ్యవహారం నడిపించింది టీడీపీ అధినేత చంద్రబాబే. చంద్రబాబు ‘బ్రీఫింగ్‌’ చేసిన వైనం ఆడియో టేపుల్లో రికార్డ్‌ అయ్యింది కూడా. అప్ప‌ట్లో ఈటేపులు సంచ‌ల‌నం సృష్టించాయి. రేవంత్‌రెడ్డిపై టీడీపీ విమర్శలు షురూ చేస్తే, ఓటుకు నోటు కేసులో చంద్రబాబుని అడ్డంగా బుక్‌ చేసేయడం రేవంత్‌రెడ్డికి పెద్ద కష్టమేమీ కాదు.

దీన్నంత‌టిని ప‌రిశీలిస్తెచంద్రబాబు పెద్ద స‌మ‌స్య‌ల్లోనె ఇరుక్కున్నారనుకోవచ్చు. రేవంత్‌రెడ్డికేమో టీడీపీలో వుండాలని లేద‌నేది స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతోంది . ఇన్నాల్లు బాబు మ్యానేజ్ చేయ‌గ‌లిగారు. కాని ప‌రిస్థితి చేదాటిపోవ‌డంతో కంభంపాటి రామ్మోహన్‌రావుని రంగంలోకి దించింది టీడీపీ. రేవంత్ రెడ్డి మ‌న‌సు మార్చుకుంటాడా లేదా కాంగ్రెస్‌లోకి వెల్ల‌డానికి ఫిక్స్ అయ్యార అనేది వేచి చూడాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -