Thursday, March 28, 2024
- Advertisement -

రఘురామపై హత్యాయత్నం.. చంద్రబాబు మాటల్లో అతర్యం ఏంటి ?

- Advertisement -

ప్రస్తుతం ఆంద్రప్రదేశ్ లో వైసీపీ రెబల్ ఎం‌పి రఘురామ కృష్ణ రాజు చుట్టూ జరుగుతున్న రాజకీయాలు హాట్ టాపిక్ గా నిలుస్తున్నాయి. ముఖ్యంగా ఆయన జగన్ కు వ్యతిరేకంగా మారినది మొదలుకొని ఇప్పటివరకు కూడా జగన్ పై రఘురామ చేసే వ్యాఖ్యలు ఎప్పుడు కూడా చర్చనీయాంశంగా మారుతూ ఉంటాయి. అలాగే రఘురామ చేసే వ్యాఖ్యలను వైసీపీ వర్గం కూడా అంతే స్థాయిలో తిప్పికొడుతూ ఉంటుంది. అయితే రఘురామ ఈ స్థాయిలో జగన్ పై విరుచుకుపడడానికి కారణం.. చంద్రబాబు హస్తం ఉందంటూ వైసీపీ నేతలు ఎప్పటి నుంచో విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇక రఘురామ కూడా చంద్రబాబుపై ఎప్పుడు తీవ్ర స్థాయిలో విమర్శలు చేయలేదు. .

దీంతో రఘురామ- చంద్రబాబు తో జట్టుకట్టే అవకాశాలు గట్టిగానే కనిపించాయి. కానీ ఆ తరువాత రఘురామ టిడిపి కాదని కాషాయ కండువా కప్పుకొనున్నారని కూడా వార్తలు వచ్చాయి. తాజాగా రఘురామ జనసేన వైపు చూస్తున్నారనే ఊహాగానాలు కూడా పెరిగిపోయాయి. అయితే ఈ వార్తలలో దేనిపై కూడా రఘురామ స్పష్టత ఇవ్వలేదు. ఇదిలా ఉంచితే తాజాగా చంద్రబాబు రఘురామ గురించి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా నిలుస్తున్నాయి. ఇటీవల గోదావరి ప్రాంతాల్లో వరద బాధితులను పరామర్శించడానికి వెళ్ళిన చంద్రబాబు.. రఘురామ ప్రస్తావనను తీసుకు వచ్చారు. రఘురామపై హత్యాయత్నం చేశారని, హత్య చేసి ఆ కేసు ఇతరులపైకి మళ్లించే ప్రయత్నం చేశారనే విధంగా వ్యాఖ్యలు చేశారు.

అయితే ఈ రకమైన వ్యాఖ్యలు చంద్రబాబు ఎందుకు చేయాల్సి వచ్చింది అనే దానిపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. అసలు వరద బాధితులను పరామర్శించడానికి వెళ్ళిన బాబు.. రఘురామ ప్రస్తావన తీసుకురావడం ఏంటనే ప్రశ్నలు కూడా ఎదురవుతున్నాయి. అయితే రఘురామపై హత్య యత్నం ఎప్పుడు చేశారు అనేదానిపై చంద్రబాబు వివరణ ఇవ్వకపోవడం గమనార్హం.గతంలో రఘురామ జైల్లో ఉన్నప్పుడూ.. ఆయనను పోలీసులు కొట్టినట్లుగా వచ్చిన వార్తలను బట్టి చంద్రబాబు ఈ రకమైన వ్యాఖ్యలు చేశారా ? లేక కొత్తగా రఘురామపై హత్యాయత్నం చేశారా ? అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. ఏది ఏమైనప్పటికి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు పోలిటికల్ సర్కిల్స్ లో కొత్త చర్చకు దారి తీస్తున్నాయి.

Also Read

మోడి పిలిచిన.. పవన్ కలవట్లేదా ?

కే‌సి‌ఆర్ సీన్ రివర్స్ అవుతోందా ?

మోడీ సర్కారుపై ..వైసీపీ గుస్సా !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -