Friday, April 26, 2024
- Advertisement -

చంద్ర‌బాబు వ్యాఖ్య‌ల‌తో డీలా ప‌డ్డ టీడీపీ శ్రేణులు…

- Advertisement -

నంద్యాల ఉప ఎన్నికపై టీడీపీ పూర్తిగా ఆశలు వదులుకున్నట్లు అర్థమవుతోంది. టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో ఆ విషయం దాదాపుగా అర్థమైపోయింది. ఏమాత్రం అవకాశం ఉన్నా గెలుపు మాదే అని గట్టిగా చెప్పే చంద్రబాబు అందుకు విరుద్ధంగా మాట్లాడ‌టం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది.

ఇప్ప‌టికే ఉప ఎన్నిక‌ల‌కోసం బాబు మంత్రులు,ఎమ్మెల్యేల‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించారు.వారు ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో నిమ‌గ్న‌మ‌య్యారు.ప్ర‌జ‌ల‌కు వ‌రాల జ‌ల్లులు కురిపిస్తున్నారు.వంద‌ల‌కోట్ల అభివృద్దిప‌నుల‌కు శ్రీకారం చుట్టినా ప్ర‌జ‌లు మాత్రం పూర్తి వ్య‌తిరేక‌త‌తో ఉన్నారు.అస‌మ్మ‌తి సెగ అమ‌రావ‌తికి తాక‌డంతో బాబు పార్టీ నాయ‌కుల‌తో స‌మావేశం ఏర్పాటు చేశారు.

నంద్యాల ప్ర‌జ‌ల‌ల్లో ప్ర‌భుత్వం ప‌ట్ల పూర్తి వ్య‌తిరేక‌త ఉంద‌ని అంగీక‌రించారు.ప్ర‌భుత్వ ప‌రంగా ఎటువంటి అభివృద్ది ప‌నులు చేసినా ఓట‌ర్లు న‌మ్మేస్థితో లేర‌ని తెలిపారు.గెలుపుకు ఉన్న ఏ చిన్న అవ‌కాశాన్ని వ‌దులుకోవ‌ద్ద‌ని నాయ‌కుల‌కు సూచించారు.దీన్ని బ‌ట్టే అర్థం అవుతుందో బాబుకు ఓట‌మి త‌ప్ప‌ద‌ని.అధికారంలో ఉండి కూడా గెలుపించుకోలేక‌పోతె అది బాబుకు మాయ‌ని మ‌చ్చ‌లాగానే ఉంటుంది.

మరికొన్ని జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు కూడా నంద్యాలలో ప్రచారం చేసే విధంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. నంద్యాల ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీడీపీ అధిష్టానం ఎలాగైనా గెలుపొందాలని తీవ్ర కసరత్తులు చేస్తోంది. ఈ క్రమంలోనే స్వయంగా చంద్రబాబు ప్రభుత్వ వ్యతిరేకతను అంగీకరించాల్సి వచ్చింది.అధినేతె అ లా మాట్లాడం వ‌ల్ల టీడీపీ శ్రేణులు మ‌రింత డీలీప‌డిపోయె అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -