Thursday, May 2, 2024
- Advertisement -

జాతీయ రాజకీయాల్లో మళ్లీ చంద్రబాబు చక్రం

- Advertisement -

చంద్రబాబునాయుడు బంతి లాంటివారు. ఎంత గట్టిగా కిందకు కొడితే అంత పైకి లేస్తారు. అనుభవంతో పాటు పోరాటపటిమ కూడా ఆయనలో రోజురోజుకూ పెరుగుతోంది. మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో తనకు పోటీగా మారతాడేమోననే భయంతోనే మోడీ కావాలనే బాబును తొక్కేస్తున్నారు. ఏపీకి ప్రత్యేకహోదాతో పాటు, విభజన హామీలు నెరవేరిస్తే, అసలే కష్టజీవి అయిన చంద్రబాబు పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతుంది. 2019 ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యత సాధించడంలో చతికిల పడినా, ఎన్డీఏ కూటమి బొటాబొటి మెజార్టీ సాధించినా, ఆ కూటమిలోని చాలా పార్టీలు మోడిని ప్రధానిగా అంగీకరించే పరిస్థితే కనిపించడం లేదు. బీజేపీ అంటే మోడీ, అమిత్ షా అన్నట్టు వ్యవహరిస్తూ నియంతల్లా ప్రవర్తిస్తున్న వీరి పోకడతో కమలం పార్టీ సహా ఎన్డీఏ కూటమి నేతలు విసిగిపోయారు. మిత్రపక్షమైన టీడీపీనే వేధించి, విసిగించి కేంద్రప్రభుత్వం నుంచి, ఎన్డీఏ కూటమి నుంచి వైదొలగేటట్టు మోడీ వ్యవహరించిన తీరు కూడా వీరిని ఆలోచనలో పడేసింది. అవసరం తీరాక మోడీ ఇలా వ్యవహరిస్తారా ? అన్నది ఏపీ టీడీపీ విషయంలో రుజువవడంతో ఎన్డీఏ కూటమి పార్టీలతో పాటు బీజేపీలోనూ ఓ వర్గం తీవ్ర అంసతృప్తితో రగిలిపోతోంది.

ఈ నేపథ్యంలో చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో, బీజేపీ వ్యతిరేక పార్టీల్లో ఐక్యత కోసం తెరవెనుక గట్టిగానే కృషి చేస్తున్నారు. అందుబాటులో ఉన్న టీడీపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశమైన ఆయన జాతీయ రాజకీయాలపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలని, బీజేపీ, కాంగ్రెస్ వ్యతిరేక కూటమికి నాయకత్వం వహించాలని బాబుని పార్టీ నేతలు కోరారు. నాయకత్వం ప్రధానం కాదు, అంటూనే చంద్రబాబు జాతీయ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయో వివరించారు. బీజేపీ ఓడిపోతేనే, ప్రత్యమ్నాయ పార్టీలు అధికారం చేపడితేనే ఏపీకి న్యాయం జరుగుతుందని, ఆ దిశగా టీడీపీ పుజుకోవాలని బాబు తన లక్ష్యాన్ని పార్టీ నేతలకు చెప్పారు. గత ఎన్నికల్లో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బీహార్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో బీజేపీ ఏకపక్షంగా విజయం సాధించింది, కానీ వచ్చే ఎన్నికల్లో మాత్రం ఆయా రాష్ట్రాల్లో గడ్డు పరిస్థితి బీజేపీకి తప్పదని బాబు వివరించారు. దక్షిణ భారతదేశంలోనూ బీజేపీకి సానుకూల వాతావరణం లేదు. వివిధ సర్వేలు, అంచనాల ప్రకారం 2019లో బీజేపీకి 120 నుంచి 150 సీట్ల వరకూ మాత్రమే వచ్చే అవకాశముందని టీడీపీ నేతలతో అన్నారు.

దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చి, బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ ఏర్పాటుకు బాబు చొరవ చూపాలని పార్టీ నేతలు కోరడంపై, మౌనం వహించినా…ఆయన ఆలోచన కూడా అదే. బీజేపీ వ్యతిరేక కూటమి ఐక్యతే లక్ష్యంగా అన్ని పార్టీలు, అగ్రనేతలతో ఆయన ఇప్పటికే టచ్ లో ఉన్నారు. ఈ సారి కేంద్రంలో కీలకపాత్ర పోషించడానికి ఉన్న ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకూడదని చంద్రబాబు ఢిల్లీ లెవల్లో ఇప్పటికే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసేశారు. కర్నూలులో ధర్మపోరాట సభ తర్వాత భవిష్యత్ కార్యాచరణ, టీడీపీ వ్యూహరచనపై చంద్రబాబు మరోసారి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసి, జాతీయ రాజకీయాల్లో తాను మళ్లీ చక్రం తిప్పడానికి అస్త్రాలు సిద్ధం చేస్తున్నారు. ఆయన వ్యూహం ఫలించి కేంద్రంలో కీలకమైతే ఏపీకి మేలే కదా…

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -