Tuesday, May 7, 2024
- Advertisement -

ఏడుగురు టిడిపి ఎమ్మెల్యేలతో సిఎం రమేష్ రహస్య భేటీ…. బాబులో ఆందోళన

- Advertisement -

గతంలో కూడా ఆర్థికంగా అండగా నిలిచిన చాలా మందికి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చాడు బాబు. మొదటి నుంచీ కష్టపడ్డవాళ్ళకు కాకుండా ఇలా డబ్బున్నవాళ్ళకు టిక్కెట్లు అమ్ముకోవడం అని బాబు టిడిపి అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచీ వరుసగా ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు టిడిపి సీనియర్ నేతలు. అయితే బాబు మాత్రం ఆర్థికంగా బలంగా ఉన్న సిఎం రమేష్, సుజనాచౌదరి, టిజి వెంకటేష్‌లాంటి వాళ్ళకే సీట్లు కేటాయిస్తూ వచ్చాడు. అయితే బాబుతో వచ్చిన సమస్య ఏంటంటే అవసరం ఉన్నంత కాలం వాడుకుని ఆ తర్వాత వదిలేయడం అనే బాబు నైజంపై చాలా మందే విమర్శలు చేశారు. ఎన్టీఆర్ కుమారులను, ఎన్టీఆర్ మరో అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావులను వాడుకుని వదిలెయ్యడంతో మొదలైన బాబు యూజ్ అండ్ త్రో పాలసీ జూనియర్ ఎన్టీఆర్ వరకూ కొనసాగింది. ఇక తాజాగా పవన్ ఎక్కడ బలడతాడో అన్న ఉద్ధేశ్యంతో కత్తి మహేష్‌ని తన భజన ఛానల్స్‌లో కూర్చోబెట్టి గంటలు గంటలు బాబే తిట్టించాడని పొలిటికల్ సర్కిల్స్‌లో చెప్పుకుంటూ ఉన్నారు.

అయితే 2014ఎన్నికల్లో తనకు ఆర్థికంగా అండగా నిలిచిన సిఎం రమేష్‌ని ఇప్పుడు వదిలించుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు చంద్రబాబు. చాలా కాలంగా సిఎం రమేష్‌ని దూరం పెడుతూ ఉన్నాడు. త్వరలో సిఎం రమేష్ రాజ్యసభ సభ్యత్వం ముగియనున్న నేపథ్యంలో మరోసారి తనకు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వాలని సిఎం రమేష్ డిమాండ్ చేస్తున్నాడు. అయితే చంద్రబాబు మాత్రం కుదరదని చెప్పేశాడు. ఈ నేపథ్యంలో సిఎం రమేష్ బాబుపై తిరగబడడానికి సిద్ధంగా ఉన్నాడని రాజకీయ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. అవినీతి వాటాల్లో చెరో సగం పంచుకోండి అని మంత్రి ఆదినారాయణరెడ్డికి స్వయంగా చంద్రబాబే ఒక ఐఎఎస్ అధికారి సమక్షంలో అవినీతి పంపకాల గురించి చెప్పాడన్న వీడియో లీకేజ్ వెనకాల సిఎం రమేషే ఉన్నాడన్నది రాజకీయ విశ్లేషకుల మాట. టిడిపి నేతలు కూడా ఈ విషయాన్ని నమ్ముతున్నారు. ఇక తాజాగా సిఎం రమేష్ మరోసారి బాబుకు ఝలక్ ఇచ్చాడు. తన ఆర్థిక పెట్టుబడితో వైకాపా నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలు, తన పెట్టుడితో 2014 ఎన్నికల్లో గెలిచిన ఏడుగురు ఎమ్మెల్యేలతో రహస్యంగా భేటీ అయ్యాడు సిఎం రమేష్. ఇప్పుడు ఈ మీటింగ్‌నే టిడిపి అధినేతలో ఆందోళన పెంచిందని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రెండు సీట్లు మాత్రమే గెలిచే అవకాశం ఉన్నప్పటికీ ……మూడో అభ్యర్థిని కూడా నిలిపి వైకాపా సీటును గుంజుకోవాలని వ్యూహాలు పన్నుతున్న బాబుకు సిఎం రమేష్ వ్యవహారం కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. మరోవైపు బిజెపి ఎమ్మెల్యేలు కూడా బాబుపై కోపంతో వైకాపాకు ఓటేస్తారేమోనన్న అనుమానాలు బాబును వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏడుగురు ఎమ్మెల్యేలతో సిఎం రమేష్ రహస్యంగా సమావేశమవ్వడం టిడిపి షాక్ ఇచ్చే విషయమే. సిఎం రమేష్ స్వతంత్ర అభ్యర్థిగా నిలబడనున్నాడా? లేక బిజెపితో సన్నిహిత సంబంధాలు ఉన్నందున బిజెపి క్యాండిడేట్‌గా నిలబడనున్నాడా? లేకపోతే వైకాపాలోకి జంప్ అయి 2019లో టిడిపిని దెబ్బకొట్టే వ్యూహరచన ఏమైనా చేస్తున్నాడా అన్న అనుమానాలు టిడిపి నేతల గుండెల్లో రైళ్ళు పరుగెత్తిస్తున్నాయి. ప్రస్తుతానికి అయితే సిఎం రమేష్ అడుగులు అనూహ్యంగా కనిపిస్తున్నాయి. ముందు ముందు ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -