Friday, March 29, 2024
- Advertisement -

మోడి పాలనలో దేశం వెనుకడుగు.. ఆధారాలతో ?

- Advertisement -

దేశంలో 2014 మోడి శకం మొదలైంది. మొదట గుజరాత్ సి‌ఎం గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న నరేంద్ర మోడి ఆ తరువాత.. ఆయన హవా దేశమంత కొనసాగించారు. దాంతో 2014 ఎన్నికల్లో ప్రధాన మంత్రి రేస్ లో నిలిచి విజయ ధూందూది మోగించారు. ఇక అప్పటినుంచి దేశంలో ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చూడుతూ తనదైన రీతిలో దేశాన్ని పరిపాలిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇదే క్రమంలో 2019 ఎన్నికల్లో కూడా ప్రజలు మోడి పరిపాలన వైపే మొగ్గు చూపారు. అయితే 2014 నుంచి ఇప్పటివరకు మోడి తీసుకునే కొన్ని నిర్ణయాలపై వ్యతిరేకత ఎదురైనప్పటికి దేశాన్ని అభివృద్ది పథంలో ముందుకు నడిపించడంలో తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఇదిలా ఉండగా మోడి పరిపాలనలో ఇండియా ప్రపంచ సూచీల్లో దారుణంగా పడిపోయిందని సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ రిపోర్ట్స్ తో సహ బయట పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలతో పోలిస్తే వివిద రంగాలలో ఇండియా దిగజారిందని, మోడి పాలనలో ఇండియా ర్యాంకులు ఏ స్థాయిలో కిందకు పడిపోయాయో ఆధారాలు చూపిస్తూ ప్రశాంత్ భూషణ్ చేసిన పోస్ట్ ఇప్పుడు ట్విట్టర్ లో వైరల్ అవుతుంది. ఐక్యరాజ్య సమితి ప్రతి ఏటా విడుదల చేసే మానవభివృద్ది సూచికలో 189 దేశాలు ఉంటే అందులో ఇండియా ర్యాంక్ 131 వ స్థానం అంటే ” సి గ్రేడ్ ” లో ఉందని, అలాగే మానవ స్వేచ్చ సూచికలో 165 దేశాలకు గాను 119 వ ర్యాంక్ తో ” సి గ్రేడ్ ” లో నిలిచిందని ,అలాగే ప్రపంచ ఆకలి సూచికలో 116 ఉంటే అందులో ఇండియా 101 స్థానంలో నిలిచి ” ఈ గ్రేడ్ ” కు దిగజారిందని ప్రశాంత్ భూషణ్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఈ విధంగా దాదాపుగా ఎనిమిది విభాగాలలో ఎందులో కూడా ఇండియా మెరుగైన ర్యాంకింగ్ కనబరచలేదని, అన్నిట్లో కూడా ” బి, సి, డి, ఈ , గ్రేడ్ లకు పరిమితం అయిందని ప్రశాంత్ భూషణ్ రాసుకొచ్చారు. 2014 నుంచి మోడి అధికారం చేపట్టిన తరువాత ప్రపంచ సూచికల్లో ఇండియా స్థానం దారుణంగా దిగజారుతు వస్తోందని, ఆయన పాలనలో అధోగతి పాలు అవుతోందంటూ ప్రశాంత్ భూషణ్ ట్విట్టర్ లో విమర్శలు గుప్పించారు.

Also Read

టాప్ లో భారత్.. ప్రమాదం తప్పదా ?

ముందస్తు సమరానికి సిద్దం ?

విడ్డూరం : మూడు పార్టీల్లో “జంపింగ్ జపాంగ్ ” ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -