Friday, April 19, 2024
- Advertisement -

లాక్ డౌన్ పెట్టడం పై.. టెస్టులు పై మంత్రి ఈటెల క్లారిటీ..!

- Advertisement -

సోషల్ మీడియాలో కొద్ది రోజులుగా లాక్ డౌన్ చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిపై తెలంగాణ ప్రభుత్వం చెక్ పెట్టింది. తెలంగాణలో లాక్ డౌన్ పెట్టే సమస్యే లేదని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ స్పష్టం చేశారు. కేసుల విషయంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో పరిస్థితి మెరుగ్గా ఉందని ఆయన అన్నారు.

ఇంకోవైపు తెలంగాణలో 50 వేల టెస్టులు చేయమని ముఖ్యమంత్రి ఆదేశించారు. అయినప్పటికి ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మాటలు మాత్రం టెస్టులను డిస్కరేజ్ చేసేలాగే ఉన్నాయి. తెలంగాణలో ప్రైవేటు ఆసుపత్రి, ల్యాబ్ లకు అనుమతి ఇచ్చాం. టెస్టులకు నిర్ణీత ధరలు నిర్ణయించాం. అయితే లక్షణాలు లేకుంటే టెస్టులు చేయొద్దని ల్యాబ్ లకు సూచనలు చేసినట్లు మంత్రి ఈటల చెప్పారు. ప్రభుత్వం కూడా కరోనా లక్షణాలు లేని వారికి పరీక్షలు చేయదు అని స్పష్టంచేశారు.

తెలంగాణలో సామాజిక వ్యాప్తి లేదని ఆందోళన అక్కర్లేదని ఐసీఎంఆర్ కూడా చెప్పినట్లు ఈటల వివరించారు. మీకు డబ్బులు పెట్టే ఉద్దేశం ఉంటే ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లొచ్చని హైదరాబాదులో 12 కార్పొరేట్ ఆస్పత్రుల్లో కరోనా చికిత్స అందుబాటులో ఉందన్నారు. ఇక తాజాగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గత రెండు రోజులుగా కోవిడ్‌ లక్షణాలు కనిపించడంతో ఎమ్మెల్యే పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌ అని తేలింది.

అచ్చెం నాయుడు ఆరోగ్యంపై జగన్ సంచలన నిర్ణయం..?

ప్రజల డబ్బు పందికొక్కుల్లా తిన్నా.. వదిలేయాలా..?

బాబూ క‌ప‌ట రాజ‌కీయాల‌కు కాలం చెల్లింది.

బట్టలు లేకుండా నిలబెట్టాడు.. నన్ను అరెస్ట్ చేయొచ్చు : జేసీ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -