Friday, April 26, 2024
- Advertisement -

బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌

- Advertisement -

మొత్తానికి మాజీ మంత్రి ఈటెల రాజేందర్ బీజేపీ చేరారు. ఢిల్లీలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ సమక్షంలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, తరుణ్ చుగ్ సమక్షంలో ఈటల కమలం కండువా కప్పుకున్నారు. ఈటలతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, కరీంనగర్‌ జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ తుల ఉమ, గండ్ర నళిని, ఆర్టీసీ కార్మిక సంఘం నేత అశ్వత్థామరెడ్డి, మాజీ ఎంపీ రమేశ్‌ రాథోడ్‌, అందె బాబయ్య తదితరులు బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్,ఎమ్మెల్యే రఘునందన్ రావు, మురళీధర్ రావు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు బీజేపీని ఆదరిస్తున్నారని తెలిపారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఇక ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. బీజేపీ విశ్వాసాన్ని వమ్ము చేయకుండా శ్రమిస్తామని తెలిపారు. రాబోయే రోజుల్లో బీజేపీలోకి మరిన్ని చేరికలు ఉంటాయని.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని పెంపొందించేలా ప్రతి ఒక్కరం కృషి చేస్తామని అన్నారు.

ఈ సాయంత్రం కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను ఈటల రాజేందర్‌ కలవనున్నారు. కాగా, భూఆక్రమణల ఆరోపణలు నేపథ్యంలో ఈటల రాజేందర్‌.. కొద్ది రోజుల కిందటే టీఆర్‌ఎస్‌కు గుడ్‌ బై చెప్పారు. భూకబ్జా ఆరోపణల కారణంగా ఈటలను ఇటీవల టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేసింది. అనంతరం పార్టీ, ఎమ్మెల్యే పదవులకు ఆయన రాజీనామా చేశారు.

రాశి ఖన్నా జెట్ స్పీడ్.. ఒకేసారి ఆరు సినిమాల్లో ఛాన్స్..!

అఖండ తర్వాత బాలయ్య నటించే బ్యానర్ ఇదే..!

ఈటలకే నా మద్దతు.. మాజీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -