Friday, March 29, 2024
- Advertisement -

ఈటలకే నా మద్దతు.. మాజీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..!

- Advertisement -

ఈటల రాజేందర్​ తరఫున ప్రచారం చేస్తానంటూ చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్​రెడ్డి పేర్కొన్నారు. 2014లో టీఆర్​ఎస్​ ఎంపీగా గెలుపొందిన కొండా విశ్వేశ్వరెడ్డి.. ఆ తర్వాత నెలకొన్న పరిణామాల మధ్య ఆయన కాంగ్రెస్​ పార్టీలో చేరారు. చేవెళ్ల ఎంపీగా కాంగ్రెస్​ తరఫున పోటీచేసి ఓడిపోయారు. అయితే ఆ తర్వాత కొండా విశ్వేశ్వర్​రెడ్డి .. కాంగ్రెస్ మార్కు రాజకీయాలతో విసిగిపోయి.. ఆ పార్టీకి కొంతకాలం దూరంగా ఉన్నారు. తర్వాత ఆయన కాంగ్రెస్​ పార్టీకి కూడా రాజీనామా సమర్పించారు. ఆయన బీజేపీలో చేరతారని వార్తలు వచ్చాయి. కానీ ఆయన ఇంకా ధ్రువీకరించలేదు.

అయితే కొండా విశ్వేశ్వర్​రెడ్డి.. కొంత కాలంగా ఈటల రాజేందర్​కు మద్దతు తెలుపుతున్నారు. టీఆర్​ఎస్ లో ఉద్యమకారులకు విలువ లేదంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఈటల రాజేందర్​ను అవినీతి ఆరోపణలతో మంత్రి పదవి నుంచి భర్తరఫ్ చేసిన అనంతరం.. ఆయన కొండా విశ్వేశ్వర్​రెడ్డిని కలుసుకున్నారు. వీరిద్దరూ కలిసి కొత్తగా ఓ రాజకీయపార్టీ పెట్టబోతున్నారంటూ వార్తలు కూడా వచ్చాయి. కానీ ఈటల అనూహ్యంగా బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. అయినప్పటికీ విశ్వేశ్వర్​రెడ్డి ఈటలకు మద్దతుగా మాట్లాడుతున్నారు.

Also Read: టీఆర్ఎస్ లో ఎల్​.రమణ చేరిక ఖాయమేనా? రేపే ప్రెస్​మీట్​..!

ఇదిలా ఉంటే ఆయన తాజాగా వికారాబాద్​ జిల్లా తాండూరులో విలేఖరులతో మాట్లాడారు.. ‘ ఈటల రాజేందర్​ను ఎలాగైనా ఓడించాలని టీఆర్​ఎస్​ కంకణం కట్టుకున్నది. అందుకోసం అవసరమైతే రూ. 1000 కోట్లు ఖర్చు చేసేందుకు కూడా ఆపార్టీ నేతలు వెనకాడరు. టీఆర్​ఎస్​ ముమ్మాటికీ కుటుంబపార్టీ. అందులో ఏ సందేహం లేదు. అక్కడంతా తండ్రి కొడుకులదే పెత్తనం. నేను ఇంకా ఏ పార్టీలోనూ చేరలేదు. ఒకవేళ టీఆర్​ఎస్​ పార్టీకి అధ్యక్షుడిగా హరీశ్​రావును చేస్తే.. నేను మళ్లీ టీఆర్​ఎస్​లో చేరతా.

ప్రస్తుతం నేను ఈటల రాజేందర్​కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నా. ఆయన కోసం హుజూరాబాద్​ వెళ్లి ప్రచారం చేస్తా’ అంటూ విశ్వేశ్వర్​రెడ్డి పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించడంలో కేసీఆర్​, కేటీఆర్​ విఫలమయ్యారని ఆరోపించారు. సుస్థిరాభివృద్ధిలో ఏపీ 3వ స్థానంలో ఉండగా, తెలంగాణ మాత్రం 11వ స్థానంలో ఉందని తెలిపారు.

Also Read: టీఆర్ఎస్ కి మరో కీలక నేత రాజీనామా

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -