Friday, May 3, 2024
- Advertisement -

‘మత్స్యకార భరోసా’ పథకం.. కష్టకాలంలో సీఎం జగన్ చేయూత!

- Advertisement -

ఏపిలో గత కొన్ని రోజుల నుంచి కరోనా కష్టాలు ప్రజలను ఎన్నో ఇబ్బందులు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ పేద ప్రజల కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే రైతులకు సహాయం అందించారు. తాజాగా వైఎస్సార్ మ‌త్స్య‌కార భ‌రోసా నిధుల విడుద‌ల కార్య‌క్ర‌మాన్ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ప్రారంభించారు. బటన్ నొక్కి ఆన్‌లైన్ ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో ముఖ్యమంత్రి న‌గ‌దు జ‌మ‌చేశారు.

ఈ పథకానికి అర్హులైన మత్స్య కారుల ఖాతాల్లోకి రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అంద‌నుంది. ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల అనుకూలంగా లేకపోవడంతో చేప‌ల వేట నిషేధ స‌మ‌యంలో కుటుంబ పోష‌ణ నిమిత్తం ఈ ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. క‌రోనా వేళ రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఆర్థికంగా క‌ష్టాలు ఉన్నప్పటికీ.. తాము పేద ప్రజల సంక్షేమం కోసం అన్ని కార్య‌క్ర‌మాలు కొన‌సాగిస్తున్నామ‌ని చెప్పారు. రాష్ట్రంలో 1,19,875 మ‌త్స్య‌కార కుటుంబాల‌కు దాదాపు రూ.120 కోట్లు జ‌మ చేశామ‌ని తెలిపారు. మ‌త్య్స‌కారుల‌కు అండ‌గా ఉంటామ‌ని ఇచ్చిన హామీని తాము నిల‌బెట్టుకుంటున్నామ‌ని వైఎస్ జ‌గ‌న్ చెప్పారు.

కోహ్లీ నా ఫెవరెట్ క్రికెటర్ కాదంటున్న రష్మిక?

బాలయ్యకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన శృతి హాసన్?

నేను నోరు విప్పితే తట్టుకోలేవ్ ఈటెలా.. : మంత్రి గంగుల కమలాకర్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -