Sunday, April 28, 2024
- Advertisement -

విభజన పోలిటిక్స్ .. మళ్ళీ తెరపైకి ?

- Advertisement -

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో పోలవరం చుట్టూ పోలిటికల్ హిట్ పెరుగుతోంది. ఇటీవల భద్రాచలం పరిసర పరిసర ప్రాంతాలలో వర్షాల కారణంగా వరదలు సంభవించి ఆయా ప్రాంతాలలో తీవ్ర నష్టం కలుగజేయాయి. దాంతో తెలంగాణ ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే లో పాల్గొని సహాయ చర్యలు చేపట్టిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ మారాయి. భద్రాచలం చుట్టూ పక్కల ఉన్న గ్రామాలను అనవసరంగా ఏపీలో కలిపారని, ఆ గ్రామాలలో వరదలు సంభవించి నష్టాల్లో ఉన్నప్పటికి ఏపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదని అన్నారు.

తెలంగాణ ప్రభుత్వమే ఆ గ్రామాలను ఆదుకుందని, అందువల్ల తిరిగి ఆ గ్రామాలను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేశారు. అయితే ఈ డిమాండ్లు తెలంగాణ నేతలు ఎప్పటినుంచో వ్నిపిస్తూనే ఉన్నారు. పోలవరం ముంపు గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలని.. పోలవరం ఎత్తు తగ్గించాలని ఎన్నో సందర్భాలలో తెలంగాణ ముఖ్యమంతి కే‌సి‌ఆర్, కే‌టి‌ఆర్ వంటివారు కూడా చెప్పుకొచ్చారు. అయినప్పటికి ఏపీ ప్రభుత్వం నుంచి అప్పట్లో ఎలాంటి రెస్పాన్స్ రాలేదు.

కానీ తాజాగా మంత్రి పువ్వాడ ఈ అంశాన్ని మళ్ళీ తెరపైకి తీసుకురావడంతో.. ఈ సారి ఏపీ ప్రభుత్వం ప్రెస్ మీట్ పెట్టి మరి కౌంటర్ ఇచ్చింది. ఇటీవల ప్రెస్ మీట్ లో ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ముంపు గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తే.. తాము తిరిగి సమైక్య ఆంధ్రప్రదేశ్ కావాలని డిమాండ్ చేస్తాం..నెరవేరుతుందా అంటూ ప్రశ్నించారు. అయితే ఈ విషయంపై గతంలో ఎప్పుడు రెస్పాన్స్ అవ్వని ఏపీ ప్రభుత్వం ఇప్పుడేందుకు రెస్పాన్స్ అవుతుందనేది ఆసక్తి రేకెత్తిస్తోంది. ముఖ్యంగా పోలవరం కేంద్రంగా మొదలైన ఈ రాజకీయం తిరిగి సమైక్యాంధ్ర కావాలనే డిమాండ్ వరకు రావడంతో ఈ వివాదం మరింత ముదిరే అవకాశం కూడా లేకపోలేదు.

More Like This

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వరు.. ఎందుకో తెలుసా ?

డోర్ డెలివరీ.. ఏంటిది జగన్ సారూ !

జగన్ సార్ .. రోడ్లు చూశారా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -