Friday, March 29, 2024
- Advertisement -

కే‌సి‌ఆర్ కాంగ్రెస్ కు మద్దతిస్తాడా ?

- Advertisement -

ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్.. కేంద్రంలో బీజేపీకి చెక్ పెట్టె ఏ చిన్న అవకాశాన్ని కూడా విడిచిపెట్టడంలేదు. విపక్షలను కలుపుకొని వచ్చే ఎన్నికల్లో బీజేపీని కేంద్రం నుంచి గద్దె దించేందుకు విశ్వ ప్రయత్నలే చేస్తున్నారు. ఇప్పటికే కే‌సి‌ఆర్ జాతీయ రాజకీయాల్లో ఆరంగేట్రానికి సంభంధించి దాదాపుగా స్పష్టత వచ్చిన నేపథ్యంలో ఆయన వేసే ప్రతి ఆడుగులు కూడా బిజెపి టార్గెట్ గానే కనిపిస్తున్నాయి. ఇటీవల తెలంగాణలో నిర్వహించిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలపై కే‌సి‌ఆర్ ఏ స్థాయిలో విమర్శలు చేశాడో తెలిసిందే. ఇక కే‌టి‌ఆర్ కూడా మోడి ని టార్గెట్ చేస్తూ తరచూ విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాడు.

ఇదిలా ఉంచితే ఇటీవల జరిగిన రాష్ట్రపతి ఎన్నికలకు గాను ఎన్డీయే కు వ్యతిరేకంగా విపక్షాలు బలపరిచిన రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సీన్హా కు కే‌సి‌ఆర్ మద్దతు పలికారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికి అసలైన చిక్కు ఇప్పుడే మొదలైంది.. ఉపరాష్ట్రపతి ఎన్నికకు గాను ఎన్డీయే తరుపున అభ్యర్థిగా జగ్ దీప్ ధన్ కర్ ప్రకటించింది బీజేపీ..అలాగే విపక్షాల తరుపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మార్గరేట్ ఆల్వా నామినేషన్ దాఖలు చేశారు. ఈమె కాంగ్రెస్ నేత కావడంతో కే‌సి‌ఆర్ ఇరకాటంలో పడ్డారు. ఎందుకంటే రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థికి ప్రత్యర్థిగా తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి యశ్వంత్ సిన్హా కు మద్దతు పలికారు కే‌సి‌ఆర్.. కానీ ఉపరాష్ట్రపతి అభ్యర్థి విషయానికొస్తే.. కే‌సి‌ఆర్ ప్రధానంగా ఎదుర్కోవాల్సిన రెండు పార్టీల అనగా బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులే పోటీలో ఉండడంతో కే‌సి‌ఆర్ సందిగ్ధంలో పడినట్లు తెలుస్తోంది.

ఒకవేళ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థికి మద్దతు ఇవ్వడం వల్ల కొత్తగా కాంగ్రెస్-టి‌ఆర్‌ఎస్ పొత్తు అంశాలు తెరపైకి వస్తాయి. ఇవి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అలా కాకుండా ఎన్డీయే బలపరిచిన అభ్యర్థికి కే‌సి‌ఆర్ మద్దతు పలికే ప్రసక్తే లేదు. కాబట్టి ఉపరాష్ట్రపతి ఎన్నికలు.. కే‌సి‌ఆర్ జాతీయ రాజకీయాలకు చిక్కుముడిగా మారాయి. ఈ నేపథ్యంలో కే‌సి‌ఆర్ ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో తటస్థంగా వ్యవహరించే అవకాశం ఉంది. మరి కే‌సి‌ఆర్ వైకరి ఈ ఎన్నికల విషయంలో ఎలా ఉంటుందో చూడాలి.

More Like This

మళ్ళీ తెరపైకి.. సమైక్యాంధ్ర డిమాండ్ ?

వారి సైలెన్స్ వెనుక.. కారణం ఆదేనా ?

మోడి కుల రాజకీయాలు చేస్తున్నారా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -