Wednesday, April 24, 2024
- Advertisement -

ఆ ముగుర్లో మునుపటి జోష్ ఏది ?

- Advertisement -

ఏపీలో ప్రభుత్వ పార్టీ తరుపున.. ప్రత్యర్థి పార్టీలపై భూతు మాటలతోనూ, విమర్శనస్త్రాలతోనూ విరుచుకుపడడంలో మాజీ మంత్రులు కొడాలి నాని, పెర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్ వంటి వారు ముందు వరుసలో ఉండే వారు. వీరు మంత్రిగా కొనసాగిన టైంలో వీళ్ళు ఇచ్చిన హామీల కన్నా.. వీరు చేసే వ్యంగ్యస్త్రలే ఎక్కువగా హైలెట్ అయ్యేవి. ప్రజా ప్రతినిధులుగా ఉన్నతమైన మంత్రి పదవిలో ఉంటూ వీరు మాట్లాడే భాష విధానం పట్ల ప్రతిపక్ష పార్టీల నుంచి మాత్రమే కాకుండా.. ప్రజల నుంచి కూడా తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఏర్పడుతూ వచ్చింది. అయినప్పటికి వీరు మాట్లాడే భాష విధానం మార్చుకున్న సందర్భాలు లేవు.. కానీ సి‌ఎం జగన్ రెండవ సారి చేసిన క్యాబినెట్ మార్పులో వీరి మంత్రి పదవులు పోవడంతో ఒక్కసారిగా కొడాలి నాని, పెర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్ సైలెంట్ అయిపోయారు.

మంత్రులుగా ఉన్నప్పుడూ ప్రతిపక్షాన్ని తిట్టడానికి, సి‌ఎం జగన్ ను పొగడడానికి అన్నట్లుగా ఉన్న వీరి వ్యవహార శైలితో తరచూ మీడియాలో కనిపించే వారు కానీ పదవులు పోయిన తరువాత .. మీడియాలో వీరి ఊసే లేదని చెప్పవచ్చు. ఏదో నామమాత్రంగా ప్లీనరీ వంటి సమావేశాల్లో తాటాకు చప్పులు చేశారే గాని, వీరిలో మునుపటి జోష్ కనిపించడం లేదనేది పోలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. మంత్రి పదవి పోయిన తరువాత పేర్ని నాని అప్పుడప్పుడు మీడియా సమావేశాల్లో కనిపిస్తున్నారు.. కానీ గతంలో ప్రతిపక్షాలపై చేసిన ఘాటు విమర్శలు ఇప్పుడు చేయడం లేదు.

అలాగే కొడాలి నాని కూడా మంత్రిగా కొనసాగిన టైంలో తరచూ తన నోటికి పని చెబుతూ.. చంద్రబాబు, లోకేష్, పవన్ లపై ఏ స్థాయిలో తిట్ల దండకం ఉండేదో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.. కానీ మంత్రి పదవి పోయిన తరువాత కోడాని నాని చేసే విమర్శలు చాలా వరకు తగ్గిపోయాయి. ఇక ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడూ అనిల్ కుమార్ యాదవ్ దూకుడు ఏ స్థాయిలో ఉండేదో అందరికీ తెలిసిందే. కానీ మంత్రి పదవి పోయిన తరువాత అనిల్ ఎక్కడున్నాడో.. ఏం చేస్తున్నాడో కూడా ఎవరికి తెలియదు. అయితే వీళ్ళు మరి ఇంత సైలెంట్ గా ఉండడానికి కారణం.. మంత్రి పదవి వదులుకోవడం వీరికి ఇష్టం లేదనే వార్తలు అప్పట్లో గట్టిగానే వినిపించాయి. అందుకే ఏదో నామమాత్రంగా పార్టీ కార్యకలాపాల్లో జోక్యం చేసుకుంటున్నారే తప్పా .. మునుపటి విధంగా యాక్టివ్ గా లేరనే వాదన పోలిటికల్ సర్కిల్స్ లో బాగా వినిపిస్తోంది.

More Like This

రఘురామ చూపు.. పవన్ వైపు ?

మోడి కుల రాజకీయాలు చేస్తున్నారా ?

పవన్ ” ఆకర్ష్ ” .. మొదలు ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -