Friday, April 19, 2024
- Advertisement -

ఆన్‌లైన్‌ తరగతులకు డేటా ఫ్రీ..!

- Advertisement -

ఆన్‌లైన్‌ తరగతులకు సాంకేతిక అభివృద్ధికి నిర్ణయం తీసుకున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. తిరుపతి ఐఐటీ ప్రాంగణంలో ఉన్నత విద్యామండలి సమావేశానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన… వందశాతం విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసులకు వీలుగా సాంకేతిక అభివృద్ధి చేస్తున్నామన్నారు.

ఒంగోలులో ఉపాధ్యాయ శిక్షణ వర్సిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నాం. పరిశోధనలకు పెద్దపీట వేయాలని సమావేశంలో తీర్మానం చేశాం. 8వ తరగతి నుంచి కంప్యూటర్ కోడింగ్‌పై తరగతుల నిర్వహణ చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం అని సురేశ్ తెలిపారు.

ఈ ఏడాది 2.20 లక్షలమంది డిగ్రీ విద్యార్థులకు ఆన్‌లైన్‌ ప్రవేశ అవకాశం కల్పించామని మంత్రి సురేశ్‌ వెల్లడించారు. వచ్చే ఏడాది నుంచి ఇంటర్‌లోనూ ఆన్‌లైన్‌ ప్రవేశాలు చేపడుతామని స్పష్టం చేశారు.

కాలి న‌డ‌క‌న తిరుమ‌ల కొండెక్కిన ఉప్పెన‌ హీరో, హీరోయిన్లు

సల్లూ భాయ్ కి థ్యాంక్స్ చెప్పిన శృంగారతార తల్లి!

ముకేశ్​ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసులో కీలక మలుపు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -