Thursday, April 25, 2024
- Advertisement -

ముకేశ్​ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసులో కీలక మలుపు..!

- Advertisement -

ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముఖేష్‌ అంబానీ ఇంటి దగ్గర పేలుడు పదార్థాలతో కూడిన ఓ వాహనాన్ని నిలిపి ఉంచడం తీవ్ర సంచలనం సృష్టించింది. దక్షిణ ముంబైలోని ముఖేష్‌ నివాసం యాంటీలియా సమీపంలోనే గురువారం సాయంత్రం స్కార్పియో వాహనం అనుమానాస్పదంగా కనిపించింది. 

బాంబు డిటెక్షన్, డిస్పోజల్‌ స్క్వాడ్, యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌(ఏటీఎస్‌) సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. ఇందులో 20 జిలెటిన్‌ స్టిక్స్‌ ఉన్నట్లు తేలిందని మహారాష్ట్ర హోం మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ ప్రకటించారు. పేలుడు పదార్థాలు ఉన్న స్కార్పియోను పోలీసులు సురక్షిత ప్రాంతానికి తరలించారు. 

జిలెటిన్​ స్టిక్స్​తో ఉన్న స్కార్పియో కారును పార్క్​ చేసిన నిందితుడి వివరాలు లభించినట్టు సమాచారం. సీసీటీవీ దృశ్యాలలో నిందితుడు నిలిపివేసిన కారు పక్క నుంచి ఓ తెల్లని ఇన్నోవా కారు వెళ్లడం పోలీసులు గుర్తించారు. ఆ వాహనంలోని వారు చెప్పిన వివరాల ఆధారంగా నిందితుడి గురించి తెలుసుకున్నట్లు పోలీసులు తెలిపారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

బుధవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాలు ఉన్న కారును నిలిపారు. అనుమానాస్పదంగా ఉన్న ఈ కారును పోలీసులు గురువారం గుర్తించి తనిఖీ చేయగా జిలెటిన్​ స్టిక్స్​ సహా అంబానీను హెచ్చరిస్తూ ఉన్న లేఖ లభ్యమయ్యాయి.

ఆసక్తి రేపుతున్న రాజేంద్రుడి ‘గాలి సంపత్’ ట్రైలర్ !

పవన్, క్రిష్ మూవీ లీకెడ్ పిక్.. వైరల్!

ఫోటో ఫీచర్ : ఈ ఫోటోలో ఉన్న చిన్నారి ఎవరో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -