Thursday, April 25, 2024
- Advertisement -

బెంగాల్‌లో పోలిటిక‌ల్ హీట్‌.. తృణ‌మూల్‌ గూటికి య‌శ్వంత్ సిన్హా

- Advertisement -

ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న కొద్ది బెంగాల్‌లో రాజ‌కీయాలు మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. రాష్ట్ర ప్ర‌ధాన పార్టీల నాయ‌కులు ఒక‌రిమీద‌ర ఒక‌రు ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లతో రెచ్చిపోతున్నారు. పార్టీలు వీడుతున్న వారితో పాటు ఆయా పార్టీల్లో చేరిక‌లు విష‌యంలో భ‌లే ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేప‌థ్యంలోనే బెంగాల్ లో ప్ర‌స్తుత అధికార పార్టీ తృణ‌మూల కాంగ్రెస్ లోకి మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ మాజీ నాయకుడు చేరారు.

ఆయ‌న కేంద్ర మాజీ మంత్రి య‌శ్వంత్ సిన్హా. గతంలో మాజీ ప్ర‌ధాని అట‌ల్ బిహారీ వాజ్‌పేయ్ ప్ర‌భుత్వంలో ఆర్థిక మంత్రిగా ప‌ని చేశారు. ఇదివ‌ర‌కు బీజేపీలో కొన‌సాగిన ఆయ‌న.. 2018లో బీజేపీని వీడారు. టీఎంసీలో చేరిన అనంత‌ర సిన్హా మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ప్ర‌స్తుతం అసాధార‌ణ ప‌రిస్థితులు నెల‌కొన్నాయ‌ని అన్నారు. దేశంలో ప్ర‌స్తుతం న్యాయ వ్య‌వ‌స్థ స‌హా ఇత‌ర అన్ని వ్య‌వ‌స్థ‌లు బ‌ల‌హీన ప‌డ్డాయ‌ని ఆరోపించారు.

మాజీ ప్ర‌ధాని అట‌ల్ బీహారీ వాజ్ పేయ్ పాల‌న ఏకాభిప్రాయంపై న‌డిచేద‌ని అనాటి విష‌యాల‌ను గుర్తుచేశారు. అయితే, నేడు ప్ర‌స్తుత బీజేపీ ప్ర‌భుత్వం అణిచివేయడం, స్వాధీనం చేసుకోవ‌డం వంటి విష‌యాల‌తోనే ముందుకు సాగుతున్న‌ద‌ని విమ‌ర్శించారు. అందుకే ఎన్డీఏ నుంచి ఒక్కొక్క‌టిగా ఇద‌ర పార్టీలు వీడుతున్నాయ‌ని పేర్కొన్నారు. కాగా, బెంగాల్‌లో ఈ సారీ ఎనిమిది ద‌శ‌ల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో పోటీ మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా జ‌రిగే అవ‌కాశ‌ముంద‌ని ఇప్ప‌టికే రాష్ట్ర రాజ‌కీయ ప‌రిస్థితులు వెల్ల‌డిస్తున్నాయి.

బుల్లితెరపై దేవిశ్రీ ప్రసాద్ అదుర్స్ !

సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబుతో కృతిశెట్టి రోమాన్స్ !

అరటి తొక్కతో ఇన్ని ప్రయోజనాలున్నాయా !

మెరిసే ముఖ సౌంద‌ర్యం కోసం.. ఈ చిట్కాలు !

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ తో హృతిక్ రోష‌న్ ఫైట్ !

former bjp leader yashwant sinha joins trinamool congress

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -