Friday, March 29, 2024
- Advertisement -

వైసీపీకీ పుల్ జోష్‌….ఫ్యాన్ కింద‌కు చేర‌నున్న ఇద్ద‌రు మాజీ మంత్రులు..

- Advertisement -

ఏపీలో ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇత‌ర పార్టీల నేత‌ల‌చేరిక‌తో ముందుకు దూసుకెల్తోంది. ఇప్ప‌టికే అభ్య‌ర్త‌ల జాబితాను ఫైన‌ల్ చేసిన జ‌గ‌న్ అభ్య‌ర్తుల‌ను ప్ర‌క‌టించేందుకు సిద్దంగా ఉన్నా పార్టీలోకి నేత‌ల వ‌ల‌స‌లు ఆగ‌డంలేదు. తాజాగా మ‌రో ఇద్ద‌రు మాజీ మంత్రులు పార్టీ కండువా క‌ప్పుకొనేందుకు సిద్దంగా ఉన్నారు.

వారిలో ఒక‌రు విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొణతాల కాగా మ‌రో క‌రు క‌డ‌ప జిల్లాకు చెందిన మాజీ మంత్రి డీఎల్‌. వైసీపీనుంచి బ‌య‌ట‌కు వెల్లిన
కొణతాల గ‌త కొంత‌కాలంగా ఏపార్టీలో చేర‌కుండా త‌ట‌స్థంగా ఉన్నారు. అయితే చివ‌ర‌కు జ‌గ‌న్‌కే జైకొట్టారు. అయితే కొన‌తాల చేరిక టీడీపీకీ మింగుడు ప‌డ‌టంలేదు. కొద్దిరోజుల క్రిత‌మే కొణ‌తాల‌కు టీడీపీ గాలం వేసింది. ఆయ‌న టీడీపీలో రేపో మాపో చేరుతున్నార‌ని విశాఖ ఎంపీ టికెట్ కూడా క‌న్ఫ‌మ్ అయ్యింద‌ని లీకులు ఇచ్చింది. అమ‌రావ‌తిలో బాబును కూడా క‌లిశారు. ఇంత‌లో ఎమైందోగాని కొణతాల టీడీపీకి షాక్ ఇచ్చేలా డెసిషన్ తీసుకున్నారు.

కొణ‌తాల ఇప్ప‌టికే అన‌కాప‌ల్లిలో త‌న అనుచ‌రుల‌తో సమావేశం అయిన ఆయ‌న వైసీపీలో చేరాల‌ని అనూహ్య‌నిర్ణ‌యం తీసుకున్నార‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలో ఆయ‌న త్వ‌ర‌లో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో భేటీ కానున్నార‌ని తెలుస్తోంది. కొణతాల అనకాపల్లి నుంచి వైసీపీ తరఫున ఎంపీగా పోటీ చేస్తారని తెలుస్తోంది

క‌డ‌ప జిల్లాకు చెందిన మాజీ మంత్రి డీఎల్ కూడా ఫ్యాన్ గూటికి చేర‌నున్నారు. మైదుకూరు నుండి పోటీ చేయాల‌ని భావించిన డీఎల్‌కు హ్యాండ్ ఇచ్చారు చంద్ర‌బాబు. ఆ టికెట్‌ను పుట్టా సుధాక‌ర్ యాద‌వ్‌కు కేటాయించ‌డంతో డీఎల్ జ‌గ‌న్‌తో భేటీ అయ్యారు. మంచి టైంలో ఇద్ద‌రు మాజీ మంత్రులు ఫ్యాన్ గూటికి చేర‌డంతో టీడీపీకీ పెద్ద దెబ్బేన‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -