Thursday, May 9, 2024
- Advertisement -

వైఎస్ పాలన ప్రజల పక్షం…. బాబుకు ప్రజాసంక్షేమం పట్టదుః గల్లా అరుణ

- Advertisement -

వైఎస్ రాజశేఖరరెడ్డి గురించి ఒక్క మంచి మాట ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళను శతృవులుగా చూసే నైజం చంద్రబాబుతో సహా పచ్చ బ్యాచ్ అందరిదీ. అలాంటి నేపథ్యంలో గల్లా అరుణకుమారి లాంటి సీనియర్ నేత వైఎస్ పాలనపై ప్రశంశలు కురిపిస్తే…….. అది కూడా చంద్రబాబు పాలనతో పోలుస్తూ వైఎస్ పాలన గొప్పదనాన్ని కీర్తిస్తే బాబు అండ్ కో జీర్ణించుకోగలరా? అసలు గల్లా అరుణకుమారి ఉద్ధేశ్యం ఏమై ఉంటుంది? టిడిపిని వీడి వైకాపాలో చేరతారా? లేక చంద్రబాబు మోసపై నైజం తట్టుకోలేక శాశ్వితంగా రాజీకయాలకు దూరమవ్వాలనుకుంటున్నారా? ఇప్పుడు ఈ విషయాలే చర్చనీయాంశం అవుతున్నాయి.

తాజాగా గల్లా ఫ్యామిలీ మొత్తం సన్నిహితులతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుంది. ఆ మీటింగ్‌లో గల్లా అరుణకుమారి కన్నీళ్ళు పెట్టుకున్నారని తెలుస్తోంది. వైఎస్ రాజశేఖరరెడ్డి సొంత చెల్లెల్లలా చూసుకునేవారని…….ప్రజలకు మంచి చేసే విషయంలో పూర్తి స్వాతంత్ర్యం ఉండేదని …..పార్టీలో గుర్తింపు, గౌరవం గొప్పగా ఉండేదని చెప్పుకొచ్చారు గల్లా. ఇఫ్పుడు బాబు పాలనలో పెన్షన్స్, రేషన్ కార్డ్‌లు కూడా ఇప్పించలేని దుస్థితి నెలకొందని……అందుకే చంద్రగిరి నియోజకవర్గంలో ప్రజలు టిడిపికి, టిడిపిలో ఉన్నందున గల్లా కుటుంబానికి కూడా దూరమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు గల్లా అరుణకుమారి. చంద్రగిరిలో టిడిపి గెలిచే అవకాశమే లేదని…….అందుకే టిడిపి నుంచి చంద్రగిరిలో పోటీ చేయనని బాబుకు చెప్పేశానని……వేరే ఏదైనా కొత్త నియోజకవర్గం కావాలని బాబును అడిగానని గల్లా అరుణకుమారి చెప్పారు.

అయితే చంద్రబాబు మాత్రం ‘నువ్వు పాలిటిక్స్ నుంచి రిటైర్ అయిపో……..గల్లా కుటుంబం నుంచి వేరే ఎవరికైనా టికెట్ ఇస్తా’ అని గల్లా అరుణకుమారి మొహం మీదే చెప్పేశాడట. ఇప్పుడు ఈ విషయంపైనే గల్లా అరుణకుమారి కన్నీళ్ళు పెట్టుకున్నారట. వైకాపాలో చేరి బాబు అహంకారానికి కౌంటర్ ఇవ్వాలన్న ఆలోచనను చాలా మంది అనుచరులు వ్యక్తం చేసినప్పటికీ గల్లా జయదేవ్‌కి ఉన్న వ్యాపార సంబంధాల దృష్ట్యా ప్రత్యర్థి పార్టీలోకి వెళితే ఇబ్బందిపడతామని గల్లా కుటుంబ సభ్యులు అభిప్రాయపడినట్టుగా తెలుస్తోంది. గల్లా అరుణకుమారి కొడుకు, గుంటూరు ఎంపి గల్లా జయదేవ్ కూడా చంద్రబాబు తీరుతో నొచ్చుకున్నాడట. కన్నీళ్ళు పెట్టుకున్న గల్లా అరుణకుమారిని ఓదార్చిన గల్లా జయదేవ్ కొంత కాలం వేచి చూద్దామని, ఆ తర్వాత బాబు స్పందనను బట్టి పార్టీ మార్పులాంటి నిర్ణయాల గురించి ఆలోచిద్దామని సన్నిహితులైన నాయకులకు చెప్పాడట జయదేవ్. ఏది ఏమైనా గల్లా కుటుంబంలో చోటు చేసుకుంటున్న రాజకీయ వ్యవహారాలు మాత్రం ఇప్పుడు టిడిపిలో తీవ్రంగా చర్చనీయాంశమవుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -