Wednesday, May 15, 2024
- Advertisement -

మా ఇంటికి రావ‌ద్దు… మీలాగా అడ్డ‌మైన గ‌డ్డి తినే వాల్లం కాదు..

- Advertisement -

య‌కులు త‌మ అవ‌స‌రాల దృష్ట్యా ఇత‌ర పార్టీల‌ల్లోకి వ‌ల‌సుల వెల్తున్నారు. ప‌ద‌వులు, డ‌బ్బుల‌కు ఆశ‌ప‌డి వెల్లినవారు కొంద‌ర‌యితే….త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్తు దృష్ట్యా వెల్తున్నవారు మ‌రి కొంద‌రు. ఇప్పుడు తాజాగా మాజీ మంత్రి గంగుల ప్ర‌తాప్ రెడ్డి టీడీపీలో చేర‌డంతో జ‌గ‌న్‌కు చెక్ పెట్ట‌వ‌చ్చ‌ని భావించిన బాబుకు చుక్కెదురైంది. సొంత అనుచ‌రులు ప్ర‌తాప్‌రెడ్డికి దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చారు.

ప్ర‌తాప్‌రెడ్డి త‌న ముఖ్యఅనుచరులతో కూడా చర్చించకుండా నేరుగా ముఖ్యమంత్రిని కలిసి కండువా కప్పుకున్న సంగ‌తి తెలిసిందే. గోస్పాడు మండలంలో తనకు భారీగా అనుచరులు ఉన్నారని సత్తా చాటుతానని మంత్రులతో చెప్పి వచ్చారు. భూమా బ్ర‌హ్మ‌నంద‌రెడ్డిని గెలిపించేందుకు కృషి చేస్తాన‌ని బాబుకు హామి చ్చారు.

అళ్ల‌గ‌డ్డ‌కు వ‌చ్చిన వెంట‌నె టీడీపీ త‌రుపున ఎన్నిక‌ల రంగంలోకి దిగాల‌ని త‌న అనుచ‌రులంద‌రికీ ఫోన్ చేసి త‌న ఇంటికి రావాల్సిందిగా కోరారు. అయితే అనుచ‌రుల‌నుంచి అనుకోని రీతిలో ఎదురుదెబ్బ‌త‌గ‌ట‌డంతో మైండ్ బ్లాక్ అయ్యింది ప్ర‌తాప్‌రెడ్డి.

అయితే గంగుల ప్రతాప్ రెడ్డి ఏర్పాటు చేసిన సమావేశానికి ఒక్క నాయకుడంటే ఒక్క నాయకుడు కూడా హాజరుకాలేదు. అందరూ వస్తారని ఎదురుచూసిన గంగుల ప్రతాప్‌ రెడ్డి చివరకు నిర్ఘాంతపోయారు. అయితే ప్రతాప్‌ రెడ్డికి ముఖ్య అనుచరులుగా ఉన్న ఇద్దరు నేతలు ఫోన్‌లోనే గంగుల ప్రతాప్‌ రెడ్డిని నిలదీశారు. మీ కోసం 30 ఏళ్లుగా భూమా కుటుంబంతో పోరాటం చేస్తున్నాం. ఇప్పుడు ఎలా టీడీపీ అభ్య‌ర్తి గెలుపుకు కృషిచేస్తామ‌ని అస‌హ‌నం వ్య‌క్తం చేస్తూ ముఖం మీద‌నె చెప్పారంట‌. దీంతో ప్రతాప్‌ రెడ్డి బిత్తరపోయారు.

అయితే గంగుల ప్రభాకర్‌ రెడ్డి వైసీపీలో క్రియాశీలకంగా ఉండడంతో గంగుల కుటుంబం అనుచరులంతా ఆయనతోనే నడిచేందుకు సిద్దమయ్యారు. 30ఏళ్ల పాటు భూమా కుటుంబంతో పోరాడి ఇప్పుడు అదే కుటుంబం గెలుపు కోసం పనిచేయాల్సిన అవసరం తమకు లేదని గంగుల ప్రభాకర్‌ రెడ్డితో పాటు వైసీపీలోనే ఉంటామని వారు స్పష్టం చేశారు. ప్ర‌తాప్ రెడ్డి ద్వారా జ‌గ‌న్‌కు చెక్ పెడదామ‌ని బాబు వేసిన ప్లాన్ బెడిసి కొట్టింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -