Thursday, May 2, 2024
- Advertisement -

అమిత్ షా లేఖకు నేను స్పందించాల్సిన అవ‌స‌రం లేదు…ప‌వ‌న్‌

- Advertisement -

జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ భాజాపాపై విమ‌ర్శ‌లు గుప్పించారు. రాష్ట్ర వ్య‌వ‌హారాల‌పై ఆయ‌న మాట్లాడితే నేనెందుకు స్పందించాల‌ని ప్ర‌శ్నించారు. హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో వామపక్ష నేతలతో పవన్ భేటీ ముగిసింది. సుమారు మూడున్నర గంటల పాటు వారి సమావేశం జరిగింది.

అమిత్ షా లేఖను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం తమకు లేదని, ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడిగా మాత్రమే ఆయన ఆ లేఖ రాశారని అన్నారు. ఏపీ వ్యవహారాలపై కేంద్ర ప్రభుత్వం నుంచి లేఖ వస్తే పరిగణనలోకి తీసుకుంటామని, అప్పుడు స్పందిస్తానని స్పష్టం చేశారు

ప్ర‌త్యేక‌హోదా లేక‌పోవ‌డం వ‌ల్ల ప్ర‌జ‌లు చాలా న‌ష్ట‌పోతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయని అన్నారు. ప్రతిసారి రాజీపడేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిందని, మౌలిక వసతులు కల్పించాల్సిన పరిస్థితిలో కూడా రాష్ట్ర ప్రభుత్వం లేదని విమర్శించారు. ఉత్తరాంధ్రలో పసిబిడ్డలు చనిపోతుంటే ఎందుకు పట్టించుకోలేదు? నిధుల కొరత ఉన్నప్పుడు పుష్కరాలకు నిధులు ఎలా ఖర్చు చేస్తారు? అని ప్రశ్నించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -