Saturday, April 27, 2024
- Advertisement -

50 శాతం స్థానాలు వారికే..

- Advertisement -

వైఎస్సార్సీపీ ఎన్నికల్లో పోటీ చేసే తమ అభ్యర్దులను ప్రకటించింది. 25 ఎంపీ స్థానాల్లో అనకాపల్లి మినహా మిగిలిన స్థానాలకు అభ్యర్దులను ఖరారు చేసింది. 175 ఎమ్మెల్యే స్థానాల్లోనూ తమ అభ్యర్దులను వెల్లడించింది. 2019 తరహాలోనే ఎంపీ అభ్యర్దులను నందిగం సురేష్, ఎమ్మెల్యే స్థానాలను సీనియర్ నేత ధర్మాన ప్రసాద రావు ప్రకటించారు. ముఖ్యమంత్రి ఈ సారి జాబితాలో 81 ఎమ్మెల్యే స్థానాల్లో, 18 ఎంపీ స్థానాల్లో మార్పులు చేసినట్లు చెప్పారు. ఈ స్థాయిలో మార్పు చేయగల ధైర్యం..ప్రజల పైన నమ్మకం వైసీపీకే ఉందన్నారు. సీట్లు దక్కని వారికి భవిష్యత్ లో ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇచ్చారు.

అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల కోసం అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ప్రతీ సందర్భంలోనూ సామాజిక న్యాయం గురించి చెప్పే జగన్ తన అభ్యర్దుల ఖరారులో అమలు చేసి చూపించారు. మొత్తం అభ్యర్థుల్లో 50 శాతం అభ్యర్థులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అవకాశం దక్కింది. 25 ఎంపీ స్థానాల్లో బీసీలకు 11 ఎంపీ, ఓసీ 9, ఎస్సీలకు 4 ఎంపీ స్థానాలు, ఎస్టీలకు 1 ఎంపీ సీట్లు ప్రకటించారు. మొత్తంగా గతంలో కంటే ఎక్కువ సీట్లు ఇచ్చారు. 2019లో బీసీలకు 41.. ఇప్పుడు 48 స్థానాలు.. మొత్తంగా ఎంపీ, ఎమ్మెల్యేల సీట్లు 200లో ఎస్సీలకు 33 స్థానాలు ఇచ్చారు. 2019లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అభ్యర్థులకు మొత్తంగా 89 స్థానాలు ఇవ్వగా.. ఈసారి 200 సీట్లలో(175+25) 100 స్థానాలు ఇచ్చారు.

టీడీపీ అధినేత చంద్రబాబు తన సొంత సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తే..జగన్ పూర్తిగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు అవకాశం ఇచ్చారు. 175 అసెంబ్లీ స్థానాల్లో బీసీలకు 48, ఎస్సీ 29, ఎస్టీ 7, మైనార్టీలకు 9 సీట్లు కేటాయించారు. మొత్తంగా 84 ఎమ్మెల్యే స్థానాలు – 16 ఎంపీ సీట్లు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చారు. పార్టీ కోసం పని చేసిన 14 మంది జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ లుగా పని చేస్తున్న వారికి ఈ సారి ఎమ్మెల్యే సీట్లు ఖరారు చేసారు. వైసీపీ ప్రకటించిన ఎంపీ, ఎమ్మెల్యే జాబితాలో 73 శాతం మంది ఉన్నత విద్యా వంతులు ఉన్నారు. 17 మంది డాక్టర్లు, 13 మంది లాయర్లు, 34 మంది ఇంజనీర్లు, 5 టీచర్లు, 2 సివిల్ అధికారులు, ఒకరు ఢిపెన్స్, మరొకరు జర్నలిస్టు ఉన్నారు. 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ఎన్నికల యుద్దంలోకి దిగుతున్నట్లు జగన్ ప్రకటించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -