Saturday, April 20, 2024
- Advertisement -

చిరంజీవి బాటలోనే ప‌వ‌న్ క‌ల్యాణ్.. అక్క‌డ నుంచే పోటీ

- Advertisement -

జ‌న‌సేన అధినేత , న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ రాజ‌కీయాలు ఇంకా ఒంట‌ప‌ట్టినట్లు లేదు. తాను పోటీ చేసే స్థానం ఏదో నిర్ణ‌యించులేక‌పోతున్నారు. మొద‌ట త‌న సామాజిక వ‌ర్గం ఎక్కువుగా ఉండే పశ్చిమ‌గోద‌వారిలో పోటీ చేయ‌ల‌ని భావించారు. త‌రువాత అనంత‌పురంలో పోటీ చేస్తాన‌ని స్వ‌యంగా ప‌వ‌నే చెప్ప‌డంతో, ఆయ‌న అక్కడ పోటీ నుంచి దిగ‌డానికి చేస్తార‌ని అంద‌రు అనుకున్నారు. కాని అక్క‌డ పోటీ చేస్తే గెల‌వ‌డం క‌ష్టం అని అనంత‌పురం నుంచి పోటీ చేయ‌ల‌నే ఆలోచ‌న‌ను విర‌మించుకున్నారు. త‌ర‌వాత కాపులు ఎక్కువుగా ఉండే గుంటూరులో ఏదో ఒక నియోజిక వ‌ర్గం నుంచి పోటీ చేద్దామ‌ని భావించిన‌ప్ప‌టికి, ఇది కూడా బెడిసి కొట్టింది. టీడీపీతో ర‌హ‌స్య పొత్తులో భాగంగా విశాఖ గాజువాక నుంచి పోటీ చేస్తున్నాన‌ని నిన్న ప్ర‌క‌టించారు.

అక్క‌డ టీడీపీ బ‌లంగా ఉన్న‌ప్ప‌టికి చంద్ర‌బాబు గాజువాక‌లో అభ్య‌ర్థిని నిల‌బెట్ట‌లేదు. దీంతో అంద‌రు ప‌వ‌న్ గాజువాక నుంచి పోటీ చేయ‌డం ఖాయం అని అనుకున్నారు. ఇంత‌లో ఏమైందో తెలియ‌దు కాని స‌డ‌న్ ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా భీమ‌వ‌రం నుంచి తాను పోటీ చేస్తానని ప్ర‌క‌టించి అంద‌రికి షాకిచ్చారు. అవును ప‌వ‌న్ క‌ల్యాణ్ భీమ‌వ‌రం అసెంబ్లీ నియోజిక వ‌ర్గం నుంచి పోటీ చేస్తున్నారు. గతంలో తన అన్న చిరంజీవి ప్ర‌జారాజ్యం పార్టీ త‌రుపున రెండోచోట్ల పోటీ చేశారు. త‌న సొంత నియోజిక వ‌ర్గం పాలకొల్లులో ఓడిపోయి తిరుపతిలో మాత్రమే గెలిచారు. ఇప్పుడు తాను కూడా అన్నయ్య దారిలో రెండు స్థానాల్లో పోటీ చేయాలని జనసేనాని భావిస్తున్నారు. భీమ‌వ‌రం, గాజువాక నుంచి పోటీ చేయ‌ల‌నే ఆలోచ‌న‌లో ఉన్నాడ‌ట ప‌వ‌న్ క‌ల్యాణ్. ఇప్ప‌టికే ప‌వ‌న్ పార్టీని త‌న అన్న పార్టీతో పోల్చి చూస్తున్న త‌రుణంలో ప‌వ‌న్ కూడా త‌న అన్న చిరంజీవి లాగే రెండు చోట్ల పోటీ చేస్తున్నారు. ఎలెక్ష‌న్ల త‌రువాత చిరంజీవిలా ప‌వ‌న్ కూడా త‌న పార్టీని ఏ అధికార పార్టీలో విలీనం చేస్తారో చూడాలి అంటూ నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -