Thursday, May 9, 2024
- Advertisement -

చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అవినీతిలో కూరుకుపోవ‌డం భాధాక‌రం..

- Advertisement -

కేంద్రం ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్‌లో ఏపీకీ జ‌రిగిన అన్యాయంపై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ స్పందించారు. ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని అప్ప‌టి ప్ర‌ధాని మ‌న్మోహ‌న్‌సింగ్ ప్ర‌క‌టించార‌ని…దాన్ని అమ‌లు చేయాల్సిన బాధ్య‌త కేంద్రానిదేన‌న్నారు. అప్పట్లో తెలంగాణ కోసం అందరూ కలిశారని, లోక్‌సభను స్తంభింపజేశారని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు విభజన హామీలను సాధించేందుకు ఓ వేదిక ఉండాలని నిర్ణయించానని తెలిపారు. మాజీ మంత్రి ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్‌, లోక్ స‌త్తా జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ లాంటి వారిని క‌లుసుకుని ముందుకు వెళతానని చెప్పారు.

రాష్ట్ర సమస్యలపై పోరాడటానికి తానొక్కడి వల్లే ఏమీ కాదన్నారు. అందుకనే ప్రెషర్ గ్రూపు ఏర్పాటు గురించి మాట్లాడుతున్నట్లు తెలిపారు. విభజన సమస్యలను పరిష్కరిస్తారనే తాను పోయిన ఎన్నికల్లో మోడి, చంద్రబాబునాయుడుకు మద్దతు ఇచ్చినట్లు వివరించారు. అయితే ప్రజల ఆకాంక్షలను నెరవేర్చటంలో రెండు ప్రభుత్వాలు విఫలమైనట్లు ఆరోపించారు. టిడిపి ప్రభుత్వం అవినీతిలో నెంబర్ 1 స్ధానంలో ఉందని ఏజెన్సీలు నివేదికలు ఇవ్వటం చాలా బాధాకరమన్నారు.

కేంద్రం నుండి రాష్ట్రానికి వచ్చిన నిధులపై కేంద్రం ఒక రకంగాను, వచ్చిన నిధుల వ్యయంలో రాష్ట్రప్రభుత్వం మరోక రకంగాను చెబుతున్నాయన్నారు. కేంద్రం నుండి రాష్ట్రానికి వచ్చిన నిధులపై తాను చంద్రబాబును ఎన్నిసార్లు లెక్కలడిగినా ఇవ్వలేదన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు చెప్పేవాటిలో అస‌త్యాలు ఉన్నాయని చెప్పారు. తాను రేపటి బంద్‌కు వ్యతిరేకం కాదని, కాకపోతే శాంతి యుతంగా నిరసనలు జరపాల్సి ఉందని చెప్పుకొచ్చారు. గురువారం రాష్ట్ర బంద్ పై తనకు పెద్దగా నమ్మకం లేదన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -