Thursday, May 9, 2024
- Advertisement -

జనసేనా !?.. తెలంగాణలో అదెక్కడుంది ?

- Advertisement -

తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో పోటీ చేస్తాం. పొత్తులపై పార్టీలతో చర్చలు జరుపుతున్నాం. జనసేన పార్టీ టికెట్ కోసం రోజూ పదుల సంఖ్యలో హైదరాబాద్ మాదాపూర్ లోని జనసేన ఆఫీసు చుట్టూ ఆశావహులు తిరుగుతున్నారు. పార్టీ భావజాలానికి, సిద్ధాంతాలకు కట్టుబడి పని చేసేవారికె టికెట్లు ఇస్తాం. ఏఏ నియోజకవర్గాల్లో బలంగా ఉన్నామో ? ఎక్కడ నుంచి పోటీ చేయాలో ? ఎక్కడ సీట్లు సర్ధుబాటు చేసుకోవాలో ? అన్ని ఆలోచనలూ చేస్తున్నాం. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైనా ఇప్పటికే చర్చలు జరిగాయి. ముందు ముందు పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో ఈ చర్చలు ముందుకెళ్తాయి..అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ( పొలిటికల్ అఫైర్స్ కమిటీ) ప్యాక్, చెప్పుకొస్తోంది. అంతేకాదు మీడియా సమావేశం పెట్టి మరీ జనసేన ఉపాధ్యక్షుడు మహేందర్‌రెడ్డి ఈ విషయాలు తెలిపారు. తెలంగాణలో జనసేన బలాబలాలపై అంచనా వేసేందుకు ప్యాక్ చర్చలు జరిపింది. తెలంగాణ రాష్ట్ర సీపీఎం కార్యదర్శి తమ్మినేని సీతారాంతో మంతనాలు జరిపాం. ఆ చర్చల సారాంశాన్ని పార్టీ అధ్యక్షుడు పవన్ కు అందజేశాం. ఆ చర్చలు మంచి ఫలితాలు ఇచ్చే అవకాశాలున్నాయని, మరోసారి పవన్ స్వయంగా కూర్చుని మాట్లాడితే పొత్తుపై ఓ స్పష్టత వచ్చేస్తుందని జనసేన ప్యాక్ చెప్పుకొచ్చింది. రేపో, ఎల్లుండో ఆ చర్చల ప్రక్రియ కూడా పూర్తయిపోతే పొత్తుల ఖరారు అంశాన్ని వెల్లడిస్తామని చెప్పారు.

కానీ అసలు ఇక్కడే వీళ్లు చాలా కామెడీ చేసేస్తున్నారనే సెటైర్లు సోషల్ మీడియాలో పేలుతున్నాయి. అసలు తెలంగాణలో జనసేన పార్టీ ఉందా ? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. పార్టీ ఆవిర్భావం తర్వాత ఒకటో రెండు మీటింగులు తప్ప ఇంకేం చేయలేదు కదా ? అని ఆలోచనలో పడుతున్నారు. పోనీ ట్విట్టర్ లో అప్పుడప్పుడూ స్పందించే పవన్ కళ్యాణ్, తెలంగాణ సమస్యలపై ఒక్కసారి కూడా ట్వీట్ చేయలేదే ? పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, కేసీఆర్ పాలన భేష్ అంటూ ఆ మధ్య పొగడ్తల్లో ముంచేశాడే ? బొకే ఇచ్చి మరీ శెభాష్ అన్నాడే ? ఆ దెబ్బతో జనసేన టీఆర్ఎస్ లో విలీనం అయిపోయిందేమో..అనే అనుమానం తమకు కలిగిందని చెబుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వలేదు. ఇచ్చిన ఒక్క డిఎస్సీ పూర్తి చేయకుండానే అసెంబ్లీ రద్దు చేసేశారు. ఏ ఒక్క కాంట్రాక్ట్ ఉద్యోగిని కూడా రెగ్యులరైజ్ చేయలేదు. గ్రూప్ వన్, గ్రూప్ 2 పోస్టుల భర్తీ ఊసే లేదు. కోట్ల నిధులు మంజూరు చేసినా ఒక్క ప్రోజెక్ట్ కూడా పూర్తి చేయలేదు. ఆ నిధులు ఎక్కడికెళ్లాయో లెక్క చెప్పే నాథుడే లేడు.

ఇలా ఏ ఒక్క సమస్యపైనా, సందర్భంలోనూ పవన్ నేరుగా మాట్లాడలేదు. పోనీ ట్వీటాడా ? ప్రభుత్వాన్ని ప్రశ్నించాడా ? అంటే అదీ లేదు. ఇప్పుడు ఎన్నికలు అనేసరికి పోటీకి సిద్ధమంటూ జనసేన తరఫున కొందరు మీడియా సమావేశాలు పెట్టడమేంటి ? బలం, చర్చలు, పోటీ, పొత్తు, అంటూ ఏదేదో మాట్లాడటమేంటి ? అని నెటిజన్లు జనసేన అధ్యక్షుడిని నిలదీస్తున్నారు. ఎంతసేపూ ఏపీకే పరిమితమైపోయి, అక్కడే ఆరు నెలలకోసారి చక్కర్లు కొట్టిన పవన్ సార్ పార్టీ….సడెన్ గా తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో పోటీ చేస్తామంటే కామెడీ కాక మరేంటి ? అని నెటిజన్లు, తెలంగాణ విద్యార్థి, ఉద్యోగ, ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. ఆ మధ్య ఏపీలోని సీపీఐ, సీపీఎం నేతలతో కలిసి ధర్నాలు, ఆందోళనలు అంటూ హడావుడి చేసిన పవన్ కళ్యాణ్, తర్వాత సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణకే అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదు. తను చేసిన ధర్నాలు, ఆందోళనల్లో వారి మద్దతుతో కమ్యూనిస్టుల ప్రజాబలంతో హంగామా చేసి, తర్వాత వారికే అపాయింట్ మెంట్ ఇవ్వని పవన్ ఇప్పుడు తెలంగాణ సీపీఐ, సీపీఎంను వాడుకుని వదిలేయడానికా ? చర్చలు పొత్తులు ఎన్నికల్లో పోటీ అంటూ….హడావుడి చేస్తున్నారని నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. మరి వీరికి పవన్ ఏం సమాధానం చెబుతాడో ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -